జ్ఞాపకాల సంకలనం: మన్మోహన్- ఒబామాలను కలిసిన రోజును గుర్తు చేసుకున్న ఇంద్రా నూయి

ఆమె ఒక తల్లి, కూతురు, సోదరి, భార్య.వీటన్నింటికి మించి ఒక పోరాట యోధురాలు.

శక్తి యుక్తులు కలిగిన నారీమణి.అతని వెంట ఆమె కాదు.

అన్నింటా ఆమే.అదే ఇప్పుడు ఆమె లక్ష్యం.

ఆవకాయ పెట్టడం నుంచి అంతరిక్షానికి చేరుకునే వరకు.అగ్గి పెట్టెల తయారీ దగ్గర్నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింటా ఆమె ఉనికి కనిపిస్తోంది.

ఆమె ఆకాశంలో సగం కాదు.ఇప్పుడు ఆమే ఆకాశం.

పురుషాధిక్య సమాజంలో మగవాళ్లను తోసిరాజని మహిళలు దూసుకెళ్తున్నారు.ఆ రంగం ఈ రంగం అని లేకుండా ఇప్పుడు అన్నింటా ఆమె తోడ్పాటు లేకుండా ఏ వ్యక్తి కానీ, ఏ వ్యవస్థ కానీ ఏం చేయలేరని ఎన్నో సార్లు రుజువైంది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా వెళ్లిన భారతీయుల్లో మహిళలు కూడా వున్నారు.

వీరు అక్కడ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడిస్తున్నారు.ఇప్పుడు అమెరికాలో రెండో శక్తివంతమైన పదవిలో వున్నది ఓ మహిళ, అందులోనూ భారతీయురాలు కావడం మనందరికీ గర్వకారణం.

అలాంటివారిలో ఒకరు భారత సంతతికి చెందిన పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి.

ప్రస్తుతం మోడీ అమెరికా పర్యటన సందర్భంగా.2009లో నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్- మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలతో జరిగిన సమావేశాన్ని ఇంద్రా నూయి గుర్తుచేసుకున్నారు.

ఆ సమయంలో ఇద్దరు నేతలు తనను ‘‘మనలో ఒకరిగా’’ పేర్కొన్నారని ఆమె చెప్పారు.

తన కొత్త పుస్తకం “My Life In Full: Work, Family, And Our Future,” లో ఇంద్రా నూయి ఈమేరకు వివరించారు.

ఈ పుస్తకం వచ్చే మంగళవారం నుంచి దుకాణాల్లో అందుబాటులోకి రాబోతోంది.చెన్నైలో జన్మించిన ఇంద్రా నూయి బాల్యం నుంచి పెప్సికో సీఈవో అయ్యే వరకు తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను ఈ పుస్తకంలో వివరించారు.

పెప్సీ సీఈవోగా ఆమె 2018లో పదవీ విరమణ చేశారు. """/"/ ఇక నవంబర్ 2009లో బాగా మంచుకురుస్తున్న ఆ మంగళవారం వాషింగ్టన్‌లో దాదాపు రెండు డజన్ల మంది అగ్రశ్రేణి అమెరికా, భారతీయ కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం జరిగిందని ఇంద్రా నూయి తెలిపారు.

ఆ సమయంలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాల మధ్య నిలబడి వున్నానని ఈ పుస్తకం ప్రారంభంలో ఆమె రాశారు.

ఒబామా, మన్మోహన్‌లు సమావేశ మందిరంలోకి ప్రవేశించగానే.అమెరికన్ బృందాన్ని ఒబామా భారత ప్రధానికి పరిచయం చేశారని ఇంద్రా నూయి చెప్పారు.

మన్మోహన్ తన దగ్గరకు రాగానే ఆమె మనలో ఒకరని వ్యాఖ్యానించారని ఇది తాను ఎన్నటికీ మరిచిపోలేని క్షణమని ఆమె గుర్తుచేసుకున్నారు.

తాను ఇప్పటికీ దక్షిణ భారతదేశంలోని మద్రాసులో ఒక సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన అమ్మాయిగానే భావిస్తానని ఇంద్రా నూయి చెప్పారు.

23 ఏళ్ల వయసులో చదువుకోవడానికి అమెరికా వచ్చానని.ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక ఐకానిక్ కంపెనీకి నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నానని.

ఇది అమెరికాలో మాత్రమే సాధ్యమని తాను నమ్ముతున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు.

చిన్నప్పుడు చరణ్ ను ఎత్తుకొని ఆడించేదాన్ని.. బాగా అల్లరి చేసేవాడు.. రోజా షాకింగ్ కామెంట్స్!