గోధుమ గడ్డితో ర‌క్త‌హీన‌త‌కు చెక్‌.. ఎలా తీసుకోవాలంటే?

ర‌క్త ‌హీన‌త.ఈ స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు.

ముఖ్యంగా స్త్రీలలో, పిల్లల్లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది.శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వ‌ల్ల ర‌క్త హీన‌త స‌మ‌స్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అయితే గోధుమ గ‌డ్డి ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

గోధుమ గ‌డ్డిలో ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.కొన్ని వేల సంవ‌త్స‌రాలుగా ఈ గోధుమ గ‌డ్డి మానవుడు ఆరోగ్య సమస్యలకు నివారిణిగి ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇక ఉద‌యాన్నే గోధుమ గ‌డ్డి జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల.అందులో ఉండే ఫోలిక ఆసిడ్‌, ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెరుగుదలకు స‌హాయ‌ప‌డుతుంది.

త‌ద్వారా ర‌క్త వృద్ధి జ‌రిగి.ర‌క్త హీన‌త‌కు స‌మ‌స్య‌కు దూరం ఉందొచ్చు.

ముఖ్యంగా మ‌హిళ‌లు గోధుమ గ‌డ్డి జ్యూస్ తీసుకోవ‌డం చాలా ఉత్త‌మం.అయితే గోధుమ గ‌డ్డి ర‌క్త‌హీన‌తను త‌గ్గించ‌డ‌మే కాదు.

మ‌రిన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.అధిక బ‌రువు త‌గ్గించ‌డంలో గోధుమ గ‌డ్డి అద్బుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

గోధుమ గ‌డ్డిలో కేల‌రీలు త‌క్కువ‌గా.ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది.

అలాంటి గోధుమ గ‌డ్డి జ్యూస్‌ తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.

దాంతో వేరే ఆహారాన్ని తీసుకోలేరు.ఫ‌లితంగా బ‌రువు త‌గ్గొచ్చు.

అలాగే గోధుమ గ‌డ్డి జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల పైల్స్ సమస్య దూరం అవుతుంది.

"""/" / అదేవిధంగా, ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉండే గోధుమ గ‌డ్డిని డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ధకం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

మ‌రియు జీర్ణ శ‌క్తి కూడా పెరుగుతుంది.అలాగే గోధుమ గ‌డ్డిని తీసుకోవ‌డం వ‌ల్ల‌.

అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా బ‌ల‌పడుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక గోధుమ గ‌డ్డిలో ఉండే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుతుంది.

కాబ‌ట్టి, మ‌ధుమేహం రోగులు గోధ‌మ గ‌డ్డిని తీసుకోవ‌డం మంచిది.

ట్రైకోడెర్మా విరిడి తో పంటలకు ఆశించే తెగుళ్ళకు చెక్..!