వాట్సాప్‌ కొత్త ఫీచర్ షురూ… బ్రాడ్‌కాస్టింగ్ కోసం ఛానల్స్‌!

ప్రపంచ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌( Whatsapp ) మంచి ఊపుమీద వుంది.

వరుస అప్‌డేట్‌లను అందిస్తూ యూజర్లను ఖుషి చేస్తోంది.మెటా యాజమాన్యంలోని ఈ కంపెనీ తాజాగా ఛానల్స్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకు రాబోతుంది.

ఇది వినియోగదారులు ఇతరులకు వేగంగా న్యూస్‌ షేర్‌ చేసేందుకు ఉపయోగపడే వన్‌-టూ-ఆల్‌ టూల్‌.

( One-two-all Tool ) ఈ ఫీచర్‌ కేవలం ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల కోసం ప్రత్యేకంగా లాంచ్ చేస్తారనే వార్తలు బాగా వినిపించాయి.

అయితే ఐఓయస్ 23.8.

0.75కి సంబంధించిన కొత్త వాట్సాప్‌ బీటాలో ఈ ఫీచర్‌ కనబడడం విశేషం.

"""/" / దీంతో ఐఓఎస్‌ యూజర్లకు( IOS Users ) కూడా ఈ స్పెసిఫికేషన్ అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ ట్రాకర్ వాబీటాఇన్ఫో( Whatsapp Tracker WabetaInfo ) ఇచ్చిన సమాచారం ప్రకారం.

వాట్సాప్‌, యాప్‌లోని ‘స్టేటస్’ ట్యాబ్‌ని ‘అప్‌డేట్స్’గా మార్చాలని, ‘ఛానల్స్’ అనే కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేయాలని ప్లాన్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ ఛానల్స్‌కి సంబంధించిన అంశాలు అప్‌డేట్స్‌ సెక్షన్‌లో లిస్ట్ అవుతాయి.కానీ ఛానల్స్‌లో స్వీకరించిన మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్‌ అనేది ఉండదు.

"""/" / ఎందుకంటే, ఈ ఛానల్స్‌ ఫీచర్‌ ద్వారా సెండ్‌ చేసే మెసేజ్‌లు పర్సనల్ లేదా గ్రూప్‌లకు పంపే మెసేజ్‌ల తరహాలో ప్రైవేట్, అదేవిధంగా సురక్షితమైనవి కావు.

అయితే ప్రైవేట్ మెసేజింగ్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రభావితం కాకుండా మాత్రం ఉంటుంది.ఇకపోతే వాట్సాప్ వినియోగదారులకు తాము సబ్‌స్క్రైబ్‌ అవ్వాలని కోరుకుంటున్న ఛానల్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది.

వినియోగదారుల కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారు లేదా ఇతరులు కూడా, ఎవరి ఛానల్‌ను ఫాలో అవుతున్నారనే వివరాలను తెలుసుకోలేరు.

అలాగే యాప్ ఆటోమేటిక్‌గా ఏ ఛానల్‌లకు సబ్‌స్క్రైబ్‌ చేయదు.