వాట్సాప్ లో ఫైల్ షేరింగ్ ఫీచర్.. ఇకపై షేర్ఇట్ అవసరం లేకుండానే ఫైల్ ట్రాన్స్ఫర్..!
TeluguStop.com
వాట్సాప్( Whatsapp ) తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే ఓ సరికొత్త ఫీచర్ పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది.ఈ సరికొత్త ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.
టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాత వాట్సాప్ ఉపయోగించే వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.వాట్సాప్ లో సరికొత్తగా రానున్న ఫీచర్ పేరు ఫైల్ షేరింగ్ ఫీచర్.
( File Sharing Feature ) ఈ ఫీచర్ ద్వారా సమీపంలో ఉండే వ్యక్తులకు ఫైల్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక షేర్ఇట్ లాంటి ఫైల్ ట్రాన్స్ఫర్ యాప్స్ అవసరం ఉండదు.
"""/" /
ఈ ఫీచర్ టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాత వాట్సప్ సెట్టింగ్స్ లో దీనికి సంబంధించిన ఆప్షన్స్ పొందవచ్చు.
ఫైల్ ట్రాన్స్ఫర్( File Transfer ) అవ్వాలంటే.వినియోగదారులు ఇద్దరు కూడా దీనికి సంబంధించిన ఆప్షన్లను ఆన్ లో ఉంచాల్సి ఉంటుంది.
ఫైల్ ఎంచుకున్న తర్వాత యూజర్ మొబైల్ ఫోన్ కు ఒక రిక్వెస్ట్ వస్తుంది.
ఆ తర్వాత రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఫైల్ ట్రాన్స్ఫర్ అవ్వడం ప్రారంభమవుతుంది.
"""/" /
ఈ ఫీచర్ ద్వారా 2GB వరకు ఉండే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
కాకపోతే ఈ ఫీచర్ ఉపయోగించడం కోసం హై స్పీడ్ డేటా అవసరం ఉంటుంది.
ఒకవేళ డేటా స్పీడ్(
Data Speed ) తక్కువగా ఉంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చాలా ఆలస్యం అవుతుంది.
కొన్ని సందర్భాల్లో గంటల సమయం కూడా పట్టవచ్చు.ఇక మీరు మీ కాంటాక్ట్ లలో సేవ్ చేయని వ్యక్తులకు ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తే, అవతలి వ్యక్తులకు మీ మొబైల్ నెంబర్ కనిపించదు.
ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండే ఈ ఫీచర్ త్వరలోనే వినియోదారుల కోసం అందుబాటులోకి రానుంది.
బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కు పోటీగా అనుష్క సినిమా.. ఇది నిజంగా భారీ షాక్ అంటూ?