వాట్సప్ న్యూ అప్డేట్ షురూ… వినియోగదారులు పండగ చేసుకోండి!

ప్రముఖ సోషల్ మెసేజింగ్ దిగ్గజం అయినటువంటి వాట్సాప్ మంచి దూకుడుమీద వుంది.రోజుకొక కొత్త అప్డేట్ తెస్తూ తన వినియోగదారులను రంజింపజేస్తోంది.

ఈ క్రమంలో వాట్సప్ ఇప్పటికే 5 బిలియన్ ప్లస్‌ డౌన్లోడ్స్ పూర్తిచేసుకొని విజయవంతంగా దూసుకుపోతోంది.

ఇప్పటికే చాలా మంది దీనిని వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాకుండా.వ్యాపార అవసరాలకు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.

అందుకోసం వాట్సాప్ బిజినెస్ అని ఒకదానిని తీసుకొచ్చారు.ఆ విషయం మీకు తెలిసినదే.

"""/"/ మిగిలిన మెసేజింగ్ యాప్స్ తో పోటీ పడేందుకు వాట్సాప్ నిత్యం సరికొత్త ఫీచర్లను, అప్ డేట్లను తీసుకొస్తుంటుంది.

తాజాగా వాట్సాప్ నుంచి మరి కొన్ని ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది.వాట్సాప్ లో ఉన్న మీడియా షేరింగ్ ఫీచర్ వల్ల వినియోగదారులకు అనేక ఉపయోగాలు ఉన్నాయి.

గతంలో వాట్సాప్ ద్వారా మీరు కేవలం 30 ఫొటోలను మాత్రమే షేర్ చేసే అవకాశం ఉండేది.

కానీ, ఇప్పటి నుంచి మీరు వాట్సాప్ ద్వారా ఒకేసారి 100 ఫొటోల వరకు షేర్ చేసుకునే అవకాశం కలదు.

"""/"/ ఇక ఈ ఫీచర్ వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.దీని ద్వారా వినియోగదారులు ఒకేసారి 100కు పైగా ఫోటోలను షేర్ చేసి వారి సమయాన్ని వృధా కాకుండా చూసుకోవచ్చు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో చూసుకుంటే వాట్సాప్ దాదాపు ఓ వంద అప్డేట్స్ వరకు తీసుకు వచ్చింది.

ప్రస్తుతం అనేక రకాల వ్యాపారాలు వాట్సాప్ మాధ్యమం ద్వారానే జరుగుతున్నాయి అంటే అర్ధం చేసుకోండి.

తాజా సర్వేల ప్రకారం ఎవరన్నా ఓ స్మార్ట్ ఫోన్ కొన్నట్టయితే మొదటగా ఆ ఫోన్లో వాట్సాప్ యాప్ నే డౌన్లోడ్ చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.

చైనాలో విజయ్ సేతుపతి మూవీ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే అన్ని రూ.కోట్లా?