వాట్సాప్ కొత్త అప్డేట్.. ‌ ‘డిస్‌ అపియరింగ్‌’ ఎలా పనిచేస్తుందో తెలుసా..?

వాట్సాప్ కొత్త అప్డేట్ ‌ ‘డిస్‌ అపియరింగ్‌’ ఎలా పనిచేస్తుందో తెలుసా?

సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దిగ్గజ కంపెనీ అయిన ఫేస్బుక్ వాట్సాప్ ను కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో అప్డేట్స్ ను ప్రజలకు తీసుకోస్తూనే ఉంది.

వాట్సాప్ కొత్త అప్డేట్ ‌ ‘డిస్‌ అపియరింగ్‌’ ఎలా పనిచేస్తుందో తెలుసా?

ఇందులో భాగంగానే తాజాగా మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.అదేమిటంటే డిస్‌అపియరింగ్ మెసేజెస్.

వాట్సాప్ కొత్త అప్డేట్ ‌ ‘డిస్‌ అపియరింగ్‌’ ఎలా పనిచేస్తుందో తెలుసా?

దీని ద్వారా ప్రజలు తమకు వచ్చిన మెసేజెస్ ను ఏడు రోజుల తర్వాత వాటంతట అవే డిలీట్ అయిపోయేలా చేసుకోవచ్చు.

అతి త్వరలో ఈ ఆప్షన్ మనకు అందుబాటులోకి రాబోతోంది.ఆండ్రాయిడ్ యూజర్లకు అలాగే ఆపిల్ ఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ ను అతి త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నారు వాట్సాప్.

ఇకపోతే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అన్న విషయానికి వస్తే.వాట్సాప్ తీసుకొస్తున్న ఈ డిస్‌అపియరింగ్ మెసేజ్ సదుపాయంతో ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత చాట్ లతో పాటు గ్రూప్ చాట్ లు కూడా కనిపించకుండా చేసుకోవచ్చు.

అయితే గ్రూప్ చాట్ డిస్‌అపియరింగ్ కావాలంటే కేవలం అది గ్రూప్ అడ్మిన్ చేతులో మాత్రమే ఉంటుంది.

ఇకపోతే ఈ ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకున్న వాట్సప్ నంబర్లకు వచ్చిన మెసేజ్ లు కేవలం 7 రోజులు మాత్రమే అందుబాటులో ఉండి ఆ తర్వాత డిలీట్ అయిపోతాయి.

ఇందులో భాగంగా ఎవరి మెసేజ్లు అయితే డిస్‌అపియరింగ్ అవ్వాలో ఆ కాంటాక్ట్ పై ఆప్షన్ ను ఎంచుకుంటే కేవలం 7 రోజుల్లో మీ ఫోన్లో నుండి ఆటోమేటిగ్గా ఆ మెసేజ్లు డిలీట్ అయిపోతాయి.

ఇక వాట్సప్ గ్రూపులలో కూడా ఇలాంటి పద్ధతిని ఉపయోగించాలి.అంతేకాకుండా ఆ మెసేజెస్ ను స్క్రీన్షాట్ తీసుకున్నా సరే తొలగించడానికి వీలుపడదు.

అంతేకాకుండా ఓ వ్యక్తి పంపించిన మెసేజ్ ను బ్యాక్ అప్ తీసుకోవడం ద్వారా ఏడు రోజుల తర్వాత కూడా మళ్లీ రిస్టోర్ చేస్తే ఆ మెసేజ్ లను తిరిగి పొందవచ్చు.

ఇకపోతే ఈ ఆప్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్న విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు వాట్సాప్.

అయితే అతి త్వరలోనే యూజర్ల దగ్గరికి తీసుకు రావడానికి సిద్ధమైపోయింది వాట్సాప్.

దేవర బ్యూటీ దశ తిరిగిందిగా.. ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ దక్కిందా?