వాట్సాప్ మెస్సేజ్‌లు ఇతరులకి కనిపించకుండా చేయొచ్చు.. అదెలాగో తెలుసా? 

వాట్సాప్.అంటే తెలియని జనాలు దాదాపు ఉండనే ఉండరని చెప్పుకోవాలి.

ప్రపంచవ్యాప్తంగా నిత్యం కొన్ని కోట్లమంది ప్రజలు దీనిని వాడుతూనే ఉన్నారు.అందువలనే ఈ వాట్సాప్ సంస్థ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనేక రకాల ఫీచర్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వస్తుంది.

ఈ నేపథ్యంలోనే వాట్సాప్ సంస్థ మరొక సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు పరిచయం చేయనుంది.

వాట్సాప్ లో కెప్ట్ మెసేజెస్ అనే ఫీచర్ ను అభివృద్ధి చేయాలని చూస్తోంది.

ఇకపోతే వాట్సాప్ డిసప్పియరింగ్ మెస్సేజెస్ అనే ఫీచర్ ను ఎప్పుడో తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేసుకుంటే నిర్దేశించిన సమయం తర్వాత మెస్సేజెస్ కనిపించకుండా పోతుంది.

ఇలా మెస్సేజ్ లు కొంత సమయం తర్వాత కనిపించకుండా పోవడం నచ్చని వారి కోసం కెప్ట్ మెస్సేజెస్ అనే ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేయడం విశేషమనే చెప్పుకోవాలి.

ఇది అందుబాటులోకి వస్తే డిసప్పియరింగ్ మెస్సేజెస్ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకున్నా సరే మెస్సేజ్ లను జాగ్రత్తగా సేవ్ చేసుకోవచ్చు.

అయితే మెసేజ్ పంపినవారు, అలాగే స్వీకరించిన వారు సైతం సేవ్ చేసుకోవచ్చు. """/"/ ఇక వద్దనుకుంటే ఆయా చాట్స్ ను సైతం పూర్తిగా తొలగించుకునే వెసులుబాటు కలదు.

అయితే కెప్ట్ మెస్సేజెస్ ఫీచర్ ను వాట్సాప్ ఎప్పుడు అమల్లోకి తీసుకురానుంది అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావలసి వుంది.

కాబట్టి దీనిని కావాలనుకోవారు ఇంకొన్ని రోజులు ఆగవలసి ఉంటుంది.ఇక వాట్సాప్ డిసప్పియరింగ్ మెస్సేజెస్ అనే ఫీచర్ గురించి అందరికీ తెలిసిందే.

అయితే ఈ ఫీచర్ కి ఇది పూర్తి భిన్నంగా పనిచేయనుందని తెలుస్తోంది.ఏదిఏమైనా సదరు ఫీచర్ కోసం వినియోగదారులు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.