వాట్సాప్ కాల్ సెక్షన్‌లో భారీ మార్పులు!
TeluguStop.com
దిగ్గజ మెసేంజర్ యాప్ వాట్సాప్ ఇప్పటికే పలు నయా ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.
ప్రతిరోజూ ఏదో ఒక అప్డేడ్ మాత్రం వాట్సాప్ గురించి వింటూనే ఉన్నాం.తాజాగా మరో అప్డేట్ వాట్సాప్ పరిచయం చేసింది.
అదే వాట్సాప్ కాల్, గ్రూప్‌కాల్ సెక్షన్లలో భారీ మార్పులు చేపట్టింది.దీనికి సంబంధించిన కొత్త 2.
11 బీటా అప్డేట్‌ను విడుదల చేసింది.ఈ కొత్త ఫీచర్‌లో భాగంగా వాట్సాప్ కాల్స్, గ్రూప్ కాల్స్‌కు సంబంధించిన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను జత చేసింది.
ప్రస్తుతం ఈ ఫీచర్ యాపిల్ ఐఓఎస్ బీటా వినియోగదారులకు అందుబాటులో ఉంది.వారు మెసేజ్ లేదా కాల్స్ చేసినపుడు, స్వీరించినపుడు ఈ ఫీచర్ కనిపించనుంది.
వాట్సాప్ బీటా ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్లను పరిశీలిస్తే యాపిల్ ఫేస్‌టైం యాప్‌ను పోలి ఉంది.
ఈ నయా ఇంటర్‌ఫేస్ ఫీచర్‌తో వాట్సాప్ వినియోగదారులకు ఆప్షన్స్ కాల్ చేస్తున్న సమయంలో సులభంగా కనిపించనున్నాయి.
"""/"/
ఓ రింగ్ బటన్ కూడా స్క్రీన్ కింది వైపు ఏర్పాటు చేశారు.
ఈ కొత్త వాట్సాప్ బీటా వెర్షన్‌తో వాట్సాప్ గ్రూప్ కాల్స్‌లో కాల్ మిస్సైన వారిని తిరిగి సులభంగా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని గ్రూప్ కాల్స్‌లో జాయిన్ అవ్వమని ఇన్వైట్ చేసినా, మీ కాల్ యాడ్ కాకపోయినా, మరోసారి వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే కాల్ కనెక్ట్ అయిపోతుంది.
ఎప్పుడైనా వాట్సాప్ కాల్ సెక్షన్‌లో ఓపెన్ చేస్తే ‘ట్యాప్ టూ జాయిన్’ అనే లేబల్ ప్రస్తుతం జరుగుతున్న వీడియో కాల్ స్క్రీన్ కింది భాగంలో ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ బీటా యూజర్లకు కూడా అందుబాటులో ఉంది.త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
ఇది అత్యంత అవశ్యకమైన ఫీచర్.చాలా మంది వినియోగదారులు ఎవరైతే కాల్స్ జాయిన్ అవ్వలేని పరిస్థితిని ఎదుర్కొన్న వారు ఈ ఫీచర్‌కు అందుబాటులోకి రావడంతో హర్షిస్తున్నారు.
ఈ ఫీచర్ మీకు రాకపోతే, త్వరలోనే మీరు కూడా పొందవచ్చు.ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చే సుకుని వినియోగించే వెసులుబాటు ఉంటుంది అతి త్వరలో అని వాట్సాప్ బీటా ఇన్ఫర్మేషన్ తెలిపింది.
రానున్న రోజుల్లో భారీ మార్పులనే చేపట్టింది వాట్సాప్.ఈ నయా ఫీచర్లతో ఇతర మెసేంజర్ యాప్‌లకు చెక్ పెడుతూ.
బీచ్ లో సిగరెట్ తాగిన బోల్డ్ బ్యూటీ ఓవియా.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!