అప్డేట్: గ్రూప్ కాలింగ్ కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్..!

ప్రముఖ సోషల్ మీడియా మెసెంజర్ యాప్‌లైన వాట్సాప్, ఫేస్బుక్.మెటా సంస్థ ఆధీనంలో ఉంటాయనే విషయం తెలిసిందే.

వాట్సాప్ విషయానికొస్తే ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్‌లు ఉన్న అందరి ఫోన్లలో నిక్షిప్తమై ఉంటుంది.

దీనిని వినియోగించని వారుండరంటే అతిశయోక్తి కాదు.ఎన్ని కొత్త మెసెంజర్ యాప్‌లు వెలుగులోకి వచ్చినా, దీనికి తిరుగు లేకుండా దూసుకుపోతోంది.

కొత్త కొత్త అప్డేట్‌లు ఇస్తూ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందజేస్తోంది.సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

తాజాగా గ్రూప్ కాలింగ్ విషయంలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఓ ప్రకటన సంస్థ నుంచి జారీ అయింది.

వీడియో కాలింగ్ విధానంలో వినయోగదారులకు మరింత సౌకర్యం కల్పించేలా వాట్సాప్ కృషి చేస్తోంది.

ఇందులో భాగంగా కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.గ్రూప్ కాలింగ్ కోసం లింక్ పంపండం, అది క్లిక్ చేస్తే గ్రూప్ కాల్‌లో చేరడం వంటివి ఇప్పటి వరకు వాట్సాప్‌లో లేదు.

ఇదే సౌకర్యంతో జూమ్, వెబెక్స్, గూగుల్ మీట్ వంటివి అందిపుచ్చుకున్నాయి.ఫలితంగా ఆఫీస్, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ఇది సౌలభ్యంగా ఉంటోంది.

దీనిని వాట్సాప్‌లో కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఎలాంటి లింక్ అవసరం లేకుండా జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

అయితే ప్రివ్యూ, రిమైండ్ వంటివి పెట్టుకునేందుకు లింక్ సౌకర్యం అందుబాటులోకి వాట్సాప్ తీసుకు రానుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలో వినియోగించేలా పరీక్షలు జరుగుతున్నాయి. """/" / కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే, వాట్సాప్‌లో వచ్చే లింక్‌ను క్లిక్ చేసి గ్రూప్ కాలింగ్‌ను ఉపయోగించవచ్చు.

ఇందులో పూర్తి భద్రత ఉంటుంది.ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండడంతో ఇతరులకు ఈ సమాచారం పొందే అవకాశం ఉండదు.

మరో కొత్త ఫీచర్‌పై ప్రయోగాలు జరుపుతోంది వాట్సాప్.సెర్చ్ ఆప్షన్‌ను కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పేజీలో పొందుపరచనుంది.

ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ డివైజ్‌లలో ఇది పని చేస్తుంది.డెస్క్ టాప్ కోసం మరిన్ని ఫీచర్లను అభివృద్ధి చేయనుంది.

పల్నాడు జిల్లా మాచర్లలో హై టెన్షన్..!!