వాట్సాప్‌లో మీకు కావలసిన ఫీచర్.. చాట్ ఫిల్టర్ ఆప్షన్ వచ్చేస్తోంది!

అవును, మీకు ఎంతొగానో వుపయోగపడిన ఫీచర్ ఒకటి మీ అభిమాన వాట్సప్ యాప్ లో( Whatsapp ) రాబోతుండడం విశేషం.

మెటా యాజమాన్యంలోని రన్ అవుతున్న ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూ వుండడం మనం గమనించవచ్చు.

ఆమధ్య వేధింపులు, నకిలీ సమాచారాన్ని ఫార్వార్డ్ చేయడం, ఇతర వినియోగదారులను మోసం చేయడం వంటి కారణాలతో భారతదేశంలో 72 లక్షలకు పైగా ఖాతాలు బ్లాక్ చేయడం అందరికీ తెలిసినదే.

మరోవైపు కొత్త ఫీచర్లను కూడా ప్రకటిస్తున్నారు.వాట్సాప్‌లో లైన్ బై లైన్ అప్‌డేట్‌లు( Whatsapp Updates ) రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

"""/" / ఈ క్రమంలో వాట్సాప్‌లో త్వరలో ఫిల్టర్ ఆప్షన్ రానుంది.ఇది చాట్ లిస్ట్‌లో గణనీయమైన మార్పును తీసుకు రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వాట్సాప్ అప్‌డేట్‌ల ట్రాకర్ నివేదిక ప్రకారం.మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వినియోగదారులకు చాట్ లిస్ట్ ఫిల్టర్ ( Chat List Filter ) అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేయబోతోంది.

ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధిలో వున్నట్టు సమాచారం.ఇది వాట్సాప్ బీటా 2.

23.14.

17 అప్‌డేట్‌లో ఉంది.ఈ కొత్త టూల్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్ కూడా హల్‌చల్ చేస్తోంది.

ఈ ఎంపిక ద్వారా చాట్ జాబితాను సులభంగా నిర్వహించవచ్చు. """/" / ఇకపోతే ఈ ఫిల్టర్‌లో మొత్తం 3 ఎంపికలు ఉంటాయి.

చదవని సందేశాలు, వ్యక్తిగత సంభాషణలు, వ్యాపార సంభాషణలు అనే 3 ఎంపికలు ఉండబోతున్నాయి.

వాట్సాప్‌లో కుడి ఎగువ మూలలో ఈ ఫిల్టర్ బటన్ ఉంటుందని చెప్పారు.ఈ ఫీచర్‌తో వినియోగదారులు ముఖ్యమైన చాట్‌లను సెకన్లలో యాక్సెస్ చేయవచ్చనే విషయాన్ని మీరు గ్రహించాలి.

అంతేకాకుండా మరెన్నో ఉపయోగాలు ఈ ఫీచర్ ద్వారా వినియోగదారుడు పొందగలడు అని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందో అన్న విషయంపైన ఇంకా క్లారిటి రావాల్సి వుంది.

రతన్ టాటాను ఇంప్రెస్ చేయడానికి సగం శాలరీ ఖర్చు చేసిన శాంతను..?