20 లక్షల వాట్సప్ అకౌంట్స్ పై నిషేధం.. ఎందుకంటే ..?

ప్రస్తుత కాలంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ ను కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు.

వాట్సాప్ ఒక్క గంట పనిచేయకపోతే చాలు ప్రాణం పోయినట్లు అల్లాడిపోతారు వినియోగదారులు.అంతగా ప్రజలకు వాట్సప్ చేరువ అయిపోయింది.

ఇది ఇలా ఉండగా 2021 అక్టోబర్ ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ గతంలో బ్యాన్ చేసిన ఎకౌంట్ల సంఖ్య రెండు కోట్ల మంది అకౌంట్స్ బ్యాన్ చేయగా, అందులో భారత్ కు చెందిన వారివి సుమారు 20 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సప్ యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు కొన్ని ఎకౌంట్లను నిషేధించినట్లు వాట్సాప్ యాజమాన్యం తెలిపింది.

అయితే వాట్సప్ మెసేజ్‌లు ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్ట్ ద్వారా సేఫ్టీగా ఉన్నప్పటికీ ఖాతాలను వాట్సప్ సిబ్బంది ట్రాక్ చేస్తూ ఉంటారు.

కాబట్టి వాట్సప్ యూజర్లు తమ రూల్స్‌ను అతిక్రమించినట్లు కనిపిస్తే వాటిని నిషేధిస్తామని వాట్సప్ స్పష్టంగా చెప్పింది.

మరి ఎలాంటి చర్యలకు పాల్పడితె వాట్సప్ ఖాతాలు బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుందో తెలుసుకోండి.

వేరొకరి పేరుతో నకిలీ ఖాతా సృష్టించడం వలన మీ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.

వీటి ద్వారా కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.ఇలా చేసిన వారి ఖాతాలను గుర్తించి వాట్సప్ బ్యాన్ చేస్తుంది.

అలాగే మీ కాంటాక్ట్ లిస్టులో లేని వ్యక్తులకు ఎక్కువగా మేసేజ్ లు పంపించటం వల్ల కూడా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది.

ఒకవేళ మీరు ప్లే స్టోర్ లో ఉన్న థర్డ్ పార్టీ వాట్సప్ యాప్ లు అయిన వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్, వాట్సాప్ ప్లస్ లను ఉపయోగించినట్లయితే ఆ యాప్స్ ద్వారా ఇతరుల వాట్సప్ ఎకౌంట్లను హ్యాక్ చేసి వారి చాటింగ్ హిస్టరీని తెలుసుకుంటూ ఉంటారు.

"""/" / అందుకే అలాంటి ఎకౌంట్లను వాట్సప్ నిషేధిస్తుంది.కొన్ని కారణాల వలన మీ అకౌంట్ ను ఎక్కువమంది యూజర్లు బ్లాక్ చేస్తే, వాళ్లు మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్నారా.

? లేరా.? అనికూడా చూడకుండా వాట్సప్ మీ ఖాతాను బ్యాన్ చేస్తుంది.

మీ వాట్సప్ ఖాతాకు వ్యతిరేకంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే మీ ఎకౌంట్ బ్యాన్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.

"""/" / మీ వాట్సప్ నుంచి ఇతరులకు చట్టవిరుధ్దమైన, సెక్స్ సంబందించిన, అసత్య ప్రచారం గాని, పరువు నష్టం కలిగించే, వేధించే, ద్వేషపూరితమైన మెసేజ్లు పంపిస్తే మీ ఎకౌంట్ ను నిషేధించే అవకాశం ఉంది.

ఒకవేళ మీరు మీ వాట్సప్ లో హింసను ప్రోత్సహించే ఫేక్ మెసేజ్ లు, వీడియోలు వేరే వారికి షేర్ చేసిన మీ వాట్సప్ ను బ్యాన్ చేసే అవకాశం ఉంది.

అందుకని మిమ్మల్ని ఎవరు పట్టించుకోరని అనుకోకుండా తస్మాత్ జాగ్రత్త.

హనుమాన్ కి మరణం లేదు కదా? మరి హనుమాన్ జయంతి అని అనకూడదా..!