శివలింగంపై పసుపు ఎందుకు వేయకూడదో తెలుసా?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం గుడికి వెళ్తుంటే చాలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ప్రసాదాలలతో పాటు కొబ్బరి కాయ తీస్కొని వెళ్తుంటాం.

అయితే ఏ గుడికి వెళ్లినా వీటిని తీసుకెళ్లడం మనకు అలవాటు.కానీ శివాలయానికి వెళ్లేటప్పుడు అంటే ముఖ్యంగా శివ లింగాన్ని పూజించేందుకు వెళ్లేటప్పుడు పసుపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే శివుడికి పసుపును దూరంగా ఉంచుతారు.స్వామి వారికి పసుపు ఇష్టం ఉండదు.

ఎందుకు ఇష్టం ఉండదు, వేస్తే ఏమవుతుంది వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకంటే పసుసును ఎక్కువగా స్త్రీల అందం కోసం వినియోగిస్తుంటారు.అందుకే శివుడికి పసుపు అంటే ఇష్టం ఉండదట.

కాబట్టి శివారాధనలో అంటే శివ లింగంపై పసుపును అస్సలే వేయకూడదు.ముఖ్యంగా మహిళలు ఎట్టి పరిస్థితుల్లో వేయ కూడదని మన పురాణాలు చెబుతున్నాయి.

అలాగే సింధూరం, తులసి ఆకులను కూడా శివ పూజ కోసం అస్సలే వినియోగించకూడదట.

ఆ భోళా శంకరుడికి ఎంతో ఇష్టమైన గంజాయి, ఉమ్మెత్తే, బిళ్వ పత్రం, గంధం, భస్మం, పచ్చి పాలను వాడితే మంచిదంటారు.

శివుడికి ఇష్టం ఉన్నవి సమర్పించడం వల్ల ఆయన కృప మనపై ఉండి.కోరుకున్నకోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం, అలాగే ఆయనను కోపానికి గురి చేయడం వల్ల మనకు ఏదైనా నష్టం జరుగుతుందనే భయం కూడా ఉంటుంది.

అందుకే ఏ దేడువికి ఏం ఇష్టమో వాటిని మనం వారికి సమర్పిస్తూ.మన కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తాం.

ఐకాన్ స్టార్ బన్నీకి 2025 సంవత్సరం కలిసొస్తోందా.. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారుగా!