జెండా ఏదైనా అజెండా ఒకటే.. మాజీఎంపీ పొంగులేటి వ్యాఖ్యలు

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీ జెండా ఏదైనా తన అజెండా మాత్రం ఒకటేనని చెప్పారు.తాను ఏ పార్టీలో చేరాననే విషయం త్వరలోనే తెలుస్తుందని వెల్లడించారు.

అదేవిధంగా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో సమావేశంలో ఏం మాట్లాడాననే దానిపై కూడా త్వరలోనే క్లారిటీ వస్తుందని పొంగులేటి తెలిపారు.

బీఆర్ఎస్ లో ఉన్న పొంగులేటి గత కొన్ని రోజులుగా పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆయన బీజేపీ గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగింది.అయితే తాజాగా షర్మిలతో భేటీ అయ్యారు పొంగులేటి.

దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

చిరంజీవి ఫ్లాప్ మూవీని ఆ హీరో మనవడు ఏకంగా 1000 సార్లు చూశాడట.. ఏమైందంటే?