రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి ఏం చెబుతారు..: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో జాతీయ నేతలు క్యూ కడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

అయితే వీరంతా రాష్ట్రంలో ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టవద్దని సూచించారు.పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఏం చెబుతారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే తెలంగాణకు మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్న కవిత పదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని చెప్పారు.

తెలంగాణ కోసం రాహుల్ గాంధీ కేంద్రాన్ని ఎప్పుడు ప్రశ్నించలేదని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడాలన్న ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు.

బన్నీ పుష్ప ది రూల్ మూవీ ప్రత్యేకతలివే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?