2022లో జరిగేది అదేనా.. బ్రహ్మం గారు ఏం చెప్పారంటే..?
TeluguStop.com
కరోనా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి.
శాస్త్రజ్ఞలు ఎంతలా ప్రయత్నించినా కానీ ఈ మహమ్మారికి మందును కనుక్కోలేకపోతున్నారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మహమ్మారి మెడలు వంచలేకపోతున్నారు.
ఈ కరోనా గురించి మనకు కాలజ్ఞానం గురించి చెప్పిన బ్రహ్మంగారు ముందుగానే హెచ్చరించారు.
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు జరిగాయి.ఇక కరోనా గురించి కూడా బ్రహ్మంగారు ముందే చెప్పడంతో అసలు కరోనా అంతం ఎప్పుడనే విషయం గురించి చాలా మంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో సెర్చ్ చేస్తున్నారు.
కరోనా గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారనే విషయాలను గురించి కూడా ఆరా తీస్తున్నారు.
2022 తర్వాత కరోనా మహమ్మారి అంతం అవుతుందా? లేదా అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
బ్రహ్మంగారు కరోనా ఎప్పుడు అంతమవుతుందని చెప్పారంటే.చాలా మంది బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి నమ్ముతుంటారు.
అసలు కాలజ్ఞానం అనేది ఒత్తి ట్రాష్ అంటూ కొంత మంది కొట్టేసినా కానీ కొంత మంది మాత్రం విపరీతంగా నమ్ముతారు.
అంతలా బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఎక్కువ విలువనిస్తారు.ఇప్పటికే కాలజ్ఞానంలో చెప్పిన అనేక విషయాలు జరిగాయి.
ప్రస్తుతం జరిగే విషయాలను కూడా ఆయన ముందుగానే ఊహించి కాలజ్ఞానంలో చెప్పారు.ఇందిరాగాంధీ పాలన వస్తుందని ఆయన ఎన్నో వందల ఏళ్ల క్రితమే ఊహించి చెప్పారు.
"""/" /
కోరంకి అను వ్యాధి కోటి మందికి తగిలి కోడి లాగ తూలి సచ్చేనయ అని బ్రహ్మంగారు చెప్పారు.
ఆయన చెప్పిన విధంగానే కరోనా ప్రస్తుతం ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తోంది.ఈ కరోనా తీవ్రత ఇప్పుడే తప్పిపోదని చాలా రోజుల పాటు ఈ మహమ్మారి తన పంజాను విసురుతుందని ఆయన చెప్పారు.
ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పిన అనేక విషయాలు సరిగ్గా జరగడంతో ఈ విషయం కూడా జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.