మీరు నెల్లాళ్ల పాటు తీపి పదార్థాలేవీ తీసుకోక‌పోతే ఏమ‌వుతుందో తెలుసా?

ఈ రోజుల్లో హెల్త్ కాన్షియ‌స్‌ ఉన్నవాళ్లు తీపి పదార్థాల‌ను త‌క్కువ‌గా తింటుంటారు.మిఠాయిలు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు ఎక్కువేన‌ని చెబుతుంటారు.

అయితే ఒక నెల రోజులపాటు మీరు తీపి ప‌దార్థాలు ఏమీ తినకపోతే ఏమి జరుగుతుందో మీకు తెలుసా? చక్కెరను అధికంగా తినడం వల‌న‌ బరువు పెరగడం, ఊబకాయం, మధుమేహం త‌దిత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

వైద్యులు, డైటీషియన్లు తీపి త‌క్కువ‌గా తినాల‌ని సలహా ఇస్తుంటారు.మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్ధాలు తిన‌కూడ‌ద‌ని చెబుతారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం పురుషుల కంటే మహిళలు తక్కువ చక్కెరను తీసుకోవాలి.

పురుషులు ప్రతిరోజూ గరిష్టంగా 30 గ్రాముల చక్కెరను మరియు స్త్రీలు ప్రతిరోజూ గరిష్టంగా 25 గ్రాముల చక్కెరను తీసుకోవాలి.

చక్కెరను స్లో పాయిజన్ అంటే స్వీట్ పాయిజన్ అంటారు.ఎందుకంటే ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది.

ఒక‌వేళ‌ మీరు చక్కెర తినడం పూర్తిగా మానేస్తే, కేవలం 30 రోజుల తర్వాత మీరు మునుపటి కంటే తేలికగా, మరింత శక్తివంతులుగా త‌యారవుతారు.

తక్కువ అలసటకు లోన‌వుతారు. """/" / అయితే ఈ ప‌ని చేయడం అందరికీ సాధ్యం కాదు.

చక్కెర వినియోగాన్ని మానేయడం మంచి విషయమేనని, అయితే సహజసిద్ధమైన స్వీట్‌లకు దూరంగా ఉండకూడదని వైద్యులు చెబుతున్నారు.

పండ్ల నుండి వచ్చే గ్లూకోజ్ శరీరానికి చాలా అవ‌స‌రం.ఇది లేకుండా, మీ శరీరంలో కొవ్వును తయారు చేయడానికి గ్లూకోజ్ ఏర్ప‌డ‌దు.

అందుకే పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తారు.

రాజమౌళి వేరే వాళ్ళ కథలతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదేనట…