Finger Millet : ఆరోగ్యానికి అండగా నిలిచే రాగులను నిత్యం తీసుకోవచ్చా.. కచ్చితంగా తెలుసుకోండి?

రాగులు( Finger Millet ).చిరుధాన్యాల్లో ఇవీ ఒకటి.

ఇంగ్లీషులో రాగులను ఫింగర్ మిల్లెట్స్ అని పిలుస్తుంటారు.ఏడాది పొడవునా పండే రాగి భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రధాన ఆహారంగా ఉంది.

అలాగే పోషకాలకు రాగులు పవర్ హౌస్ లాంటివి.రాగుల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, విటమిన్ కె, విటమిన్ బి 6, విటమిన్ బి2, విటమిన్ బి1, ప్రోటీన్, ఫైబర్ తో సహా అనేక పోషకాలు నిండి ఉంటాయి.

అందువల్ల రాగులు ఆరోగ్యానికి అండగా నిలబడతాయి.రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే అధిక బ‌రువు త‌గ్గుతారు.

రక్తహీనత( Anemia ) బారిన పడకుండా ఉంటారు. """/" / రాగుల్లో ఉండే ఫైబర్ కంటెంట్ మధుమేహం నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

అలాగే రాగులు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

రాగుల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయి.రాగుల్లో ఉండే పోషకాలు మీ కణాలకు కవచంలా పనిచేస్తాయి.

అందుకే రాగులను డైట్ లో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగుల‌ను నిత్యం తీసుకోవచ్చా అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది.

"""/" / ఈ విషయం గురించే ఇప్పుడు చర్చించబోతున్నాము.రాగులు నిత్యం తీసుకోవచ్చు.

కానీ దానికంటూ కొన్ని పరిమితులు ఉంటాయి.అతిగా తీసుకుంటే అమృతమైనా విషం అవుతుంది.

ఇందుకు రాగులు కూడా మినహాయింపు కాదు.ఒక వ్యక్తి రోజుకు 80 గ్రాముల వరకు రాగులను తీసుకోవచ్చు.

ఇలా కాకుండా అతిగా రాగులను తీసుకుంటే పలు దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఎటువంటి లిమిట్ లేకుండా రాగుల‌ను తీసుకుంటే అందులో ఉండే కాల్షియం మీ శరీరంలోని ఆక్సాలిక్ యాసిడ్‌ను పెంచుతుంది.

ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీయవచ్చు.ఒకవేళ మీకు ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే రాగులను మీరు స్కిప్ చేయడమే మంచిది.

లేదా చాలా మితంగా తీసుకోవాలి.అలాగే రాగుల్లో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది.

ఇది కొంతమంది వ్యక్తులలో ఉబ్బరం, గ్యాస్ మరియు అతిసారం వంటి జీర్ణ సమస్యలను( Digestive Problems ) కలిగిస్తుంది.

థైరాయిడ్ ఉన్నవారు కూడా రాగులను తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించాలిజ‌ ఎందుకంటే రాగుల్లో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి మరియు పనితీరులో అడ్డంకులు ఏర్ప‌ర్చే సమ్మేళనాలు ఉంటాయి.

ఇక రాగుల‌ను అతిగా తీసుకోవడం వల్ల కొందరిలో అలర్జీ సమస్యలు సైతం తలెత్తుతాయి.

భజన సమయంలో డ్యాన్స్ చేస్తుండగా భక్తుడికి గుండెపోటు.. షాకింగ్ వీడియో వైరల్..??