Nagarjuna : నాగార్జున ఆ సూపర్ హిట్ సినిమాను వదిలేయడానికి కారణం ఏంటంటే..?
TeluguStop.com
అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున( Nagarjuna ) మొదటి నుంచి ఇప్పటివరకు కూడా వరుసగా సక్సెస్ లను అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకుంటున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా కింగ్ నాగార్జున గా తన పేరు మారిమ్రోగిపోతుందనే చెప్పాలి.
ఇక కెరీయర్ మొదట్లో డిఫరెంట్ క్యారెక్టర్లను ప్రయత్నం చేసిన నాగార్జున ఇప్పుడు మాత్రం కొన్ని కమర్షియల్ పాత్రలనే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
"""/" /
ఇక 60 సంవత్సరాలు పైబడిన నాగార్జున ప్రస్తుతం యంగ్ హీరోలకి సైతం పోటీ ఇస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున ఒక సూపర్ హిట్ సినిమాని రిజెక్ట్ చేశాడు అనే విషయం చాలా మందికి తెలియదు.
బాబీ డైరెక్షన్ లో జై లవకుశ సినిమా సూపర్ హిట్ తర్వాత వెంకటేష్, నాగచైతన్యను హీరోలుగా పెట్టి బాబీ చేసిన వెంకీ మామ సినిమా( Venky Mama )వెంకీ మామ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే బాబీ నాగార్జునకి 'వాల్తేరు వీరయ్య( Waltair Veerayya )' సినిమా కథ చెప్పాడంట.
"""/" /
దాంతో నాగార్జున దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ సినిమా కథని చిరంజీవికి వినిపించాడట.
ఇక చిరంజీవి ఈ సినిమా మీద మంచి నమ్మకం పెట్టుకొని కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించారు.
ఇక మొత్తానికైతే ఈ సినిమా తో చిరంజీవి కెరీయర్ లోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించాడనే చెప్పాలి.
ఇక ఈ సినిమా దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడం విశేషమనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం నాగార్జున కూడా వరుస సినిమాలకి కమిట్ అవుతున్నాడు.
రోడ్డుపై రీల్స్ చేస్తున్న యువత.. ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చిన కారు.. చివరకు?