రానా నాయుడు వల్ల వెంకటేష్ లాభం ఏంటి..?

టాలీవుడ్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కి సెపరేట్ ఇమేజ్ ఉంటుంది.మామూలుగా అయితే స్టార్ హీరోలకు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కానీ వెంకీ మామకు మాత్రం అసలు ఎలాంటి యాంటీ ఫ్యాన్స్ ఉండరు.

అందరు హీరోల ఫ్యాన్స్ కూడా వెంకటేష్ సినిమాలు చూసి ఇష్టపడతారు.అలాంటి వెంకటేష్ కెరీర్ లో ఫస్ట్ టైం ఒక వెబ్ సీరీస్ చేశాడు.

అదే రానా నాయుడు.నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించిన ఈ వెబ్ సీరీస్ లో వెంకటేష్ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు.

"""/"/ ఈ వెబ్ సీరీస్ లో రానా కూడా నటించాడు.వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా నటించారు.

ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.మార్చి 10న నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సీరీస్ రిలీజ్ అవుతుంది.

అయితే ఈ వెబ్ సీరీస్ వల్ల వెంకటేష్ కు ఎలాంటి లాభం అన్నది దగ్గుబాటి ఫ్యాన్స్ చర్చిస్తున్నారు.

వెంకటేష్ విలక్షణ నటుడే కానీ రానా నాయుడు వెంకటేష్ లుక్ అంతగా బాగాలేదని కొందరి టాక్.

ఈ వెబ్ సీరీస్ వల్ల వెంకటేష్ కి కొత్తగా ఏం వస్తుందని అంటున్నారు.

అయితే నటుడు అన్న తర్వాత ఏదైనా చేయాలి అందుకే రనా నాయుడు వెబ్ సీరీస్ వెంకటేష్ చేసి ఉంటాడని అంటున్నారు.

ఏది ఏమైనా రానా, వెంకటేష్ పోటీపడి మరి చేసిన రానా నాయుడు ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

మహేష్ బాబు ప్రియాంక చోప్రాలతో సైలెంట్ గా వర్క్ షాప్ కండెక్ట్ చేస్తున్న రాజమౌళి…