ఐబ్రోస్ నల్లగా, ఒత్తుగా రావాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే!

సాధార‌ణంగా క‌ళ్లు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాలంటే ఐబ్రోస్ అందంగా ఉండాలి.అందుకే ఐబ్రోస్ పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దుకోవాలని అంద‌రూ భావిస్తారు.

ఇందులో భాగంగా న‌ల్ల‌గా, ఒత్తుగా కనబడే ఐబ్రోస్ ను ఎక్కువ మంది ఇష్ట‌ప‌డ‌తారు.

కానీ, అంద‌రివీ అలా ఉండ‌వు.కొంద‌రికి ఐబ్రోస్ అస్స‌లు పెర‌గ‌వు.

అయితే ఇప్ప‌డు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్ పాటిస్తే.ఐబ్రోస్ న‌ల్ల‌గా, ఒత్తుగా పెరుగుతాయి.

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం. """/"/ అందులో మొద‌టిది.

స‌హ‌జ‌మైన క‌ల‌బంద గుజ్జు తీసుకుని ఐబ్రోస్‌కు అప్లై చేయాలి.అనంత‌రం సున్నితంగా మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మ‌సాజ్ చేయాలి.

ఇప్పుడు చ‌ల్ల‌టి నీటితో కనుబొమ్మ‌ల‌ను క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే.

ఐబ్రోస్ న‌ల్ల‌గా, ఒత్తుగా పెరుగుతాయి. """/"/ ఉల్లిపాయ రసం కూడా ఐబ్రోస్ ఒత్తుగా పెర‌గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

అందుకు ముందుగా ఉల్లిపాయను పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సాన్ని కళ్ల‌ల్లో ప‌డ‌కుండా.

ఐబ్రోస్‌కు మాత్ర‌మే అప్లై చేయాలి.ఒక ప‌ది నిమిషాల పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

"""/"/ అలాగే ప్ర‌తి రోజు నిద్రించే ముందు ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని.

ఐబ్రోస్ కు అప్లై చేయాలి.అనంత‌రం కొన్ని నిమిషాల పాటు వేళ్లుతో సున్నితంగా మ‌సాజ్ చేయాలి.

ఆ త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ మరియు ఈ పుష్క‌లంగా ఉంటాయి.

కాబ‌ట్టి, ఈ ఆయిల్ రాయ‌డం వ‌ల్ల‌ ఐబ్రోస్ ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. """/"/ ఎగ్ వైట్ కూడా ఐబ్రోస్ ఒత్తుగా పెర‌గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

అందుకు ముందుకు ఎగ్ వైట్‌లో కాట‌న్ బాల్ డిప్ చేసి.ఐబ్రోస్‌కు అప్లై చేయాలి.

బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

Chandra Mohan : చంద్రమోహన్‌కి వణుకు పుట్టించిన అలీ కూతురు..