మీ పిల్ల‌లు నైట్ లేట్‌గా ప‌డుకుంటున్నారా..అయితే ఇలా చేయండి!

నేటి ఆధునిక కాలంలో చాలా మంది పిల్ల‌ల‌కు నైట్ టైమ్ లేట్‌గా నిద్రించే అల‌వాటు ఉంటుంది.

టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్ టాప్ల‌తోనే స‌మ‌యాన్ని గ‌డుపుతూ ఆల‌స్యంగా నిద్ర పోతుంటారు.అయితే పెద్ద వారితో పోలిస్తే పిల్లలు ఎక్కువ స‌మ‌యం పాటు నిద్ర పోవాలి.

అలా కాకుండా నిద్రను నిర్ల‌క్ష్యం చేస్తూ లేట్‌గా ప‌డుకుంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా జ్ఞాప‌క శ‌క్తి త‌గ్గ‌డం, ఏకాగ్రత‌, చురుకుద‌నం లోపించ‌డం, మానసిక ఒత్తిడి, శ‌రీర‌కంగా బ‌ల‌హీన ప‌డ‌టం, త‌ర‌చూ అల‌సిపోవ‌డం, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోవ‌డం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు పిల్ల‌ల్లో ఏర్ప‌డ‌తాయి.

అందువ‌ల్ల‌, త‌ల్లి దండ్రులు పిల్ల‌ల‌ను తొందరగా నిద్రపుచ్చాలి ఉంటుంది.మ‌రి అందు కోసం ఏం చెయ్యాలి.

ఎలా నిద్ర పుచ్చాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / సాధార‌ణంగా చాలా మంది పిల్ల‌లు నిద్ర రావ‌డం లేద‌ని చెప్పి టీవీ చూస్తూ లేదంటే స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటారు.

అయితే అలాంటి స‌మ‌యంలో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు మంచి క‌థ‌లు చెప్ప‌డం లేదా ఏవైనా పుస్త‌కాలు చ‌దివి వినిపించ‌డం చేస్తే.

పిల్లల ఊహాశక్తి పెరుగుతుంది.మ‌రియు త్వ‌ర‌గా నిద్ర‌లోకి జారుకుంటారు.

అలాగే పిల్ల‌లు ద్వారా నిద్ర పోవాలంటే వారి డైట్‌లో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్‌, షుగ‌ర్ ఫుడ్స్ లేకుండా చూసుకోవాలి.

ఎందుకంటే, ఈ ఆహారాలు వారి నిద్ర‌ను దెబ్బ తీస్తాయి.పిల్ల‌ల‌కు రాత్రి భోజ‌నం చేసిన ఒక‌టి లేదా రెండు గంటల‌ త‌ర్వాత గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలు తాగించాలి.

ఇలా చేస్తే త్వ‌ర‌గా నిద్రపోతారు.ఇక పిల్ల‌లు నైట్ ఫాస్ట్‌గా నిద్ర పోవాలంటే.

వారి ప‌డుకునే రూమ్ ప్ర‌శాంతంగా, మంచి గాలి వ‌చ్చే విధంగా ఉంచాలి.మ‌రియు రూమ్‌లో త‌క్కువ కాంతి ఉండేలా చూసుకోవాలి.

ఇలా చేస్తే పిల్ల‌లు త్వ‌ర‌గా నిద్రిస్తారు.‌ .

మహేష్ జక్కన్న మూవీ కోసం స్టార్ ప్రొడ్యూసర్.. బాహుబలి2ను మించిన కలెక్షన్లు పక్కా!