ఈ రెండు ప‌దార్థాలుంటే చాలు..దీపావ‌ళికి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అవ్వొచ్చు!

దీపావ‌ళి పండ‌గ వ‌స్తోంది.పండ‌గంటే అంద‌రిలోనూ తామే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా క‌నిపించాల‌నే కోరిక అంద‌రికీ ఉంటుంది.

అయితే మీ కోరిక నిజ‌మ‌వ్వాల‌నుకుంటే ఇప్పుడు చెప్పే విధంగా చేయండి చాలు.ఖ‌చ్చితంగా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అవుతారు.

మ‌రి లేటెందుకు ప‌దండీ అసలు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం.బంగాళాదుంప‌, టమాటో.

ఈ రెండూ దాదాపు అంద‌రి ఇళ్ళ‌ల్లో ఉండే కామ‌న్ కూర‌గాయ‌లు.అలాగే మ‌న‌కు ఇప్పుడు కావాల్సిన మెయిర్ ఇంగ్రీడియ‌న్స్ కూడా.

వీటితో ఏం చేయాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు ఒక పీల్ తీసేసిన బంగాళాదుంప‌, ఒక ట‌మాటో తీసుకుని వాట‌ర్‌తో సాయంతో మెత్త‌గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.

"""/"/ స్టెప్‌-1: ఒక గిన్నెలో రెండు స్పూన్ల బంగాళాదుంప‌-టమాటో పేస్ట్‌, ఒక స్పూన్ ప‌చ్చి పాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మంతో ముఖాన్ని, మెడ‌ను క్లిన్సింగ్ చేసుకుని వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

స్టెప్‌-2: ఒక గిన్నెలో రెండు స్పూన్ల బంగాళాదుంప‌-టమాటో పేస్ట్‌, ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడ‌ర్ వేసుకుని క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని యూజ్ చేసి.రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫేస్‌ను, నెక్‌ను స్క్ర‌బ్ చేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.స్టెప్‌-3: ఒక గిన్నెలో రెండు స్పూన్ల బంగాళాదుంప‌-టమాటో పేస్ట్‌, ఒక స్పూన్ పెస‌ర పిండి, ఒక స్పూన్ చంద‌నం పొడి, ఒక స్పూన్ రోజ్ వాట‌ర్ మ‌రియు అర స్పూన్ ఆలోవెర జెల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.ఇర‌వై నిమిషాల అనంత‌రం కూల్ వాట‌ర్‌తో వాష్ చేసుకోవాలి.

"""/"/ ఇలా ఒక్కసారి చేస్తే చాలు దీపావళి పండ‌గ నాడు మీ మొఖం మిళ మిళ మెరిసిపోతుంది.

మేక‌ప్ అవ‌స‌రం కూడా ఉండ‌దు.న్యాచుర‌ల్‌గానే అందంగా, కాంతివంతంగా క‌నిపిస్తారు.

చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. గేమ్ ఛేంజర్ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అంటూ?