పూరి సినిమాలో హీరోయిన్ అంటే.. ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఇంట్రెస్ట్.. ఎందుకో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ఉన్నా ఎందుకో పూరిజగన్నాథ్ సినిమాలకు మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

ఇక పూరి సినిమాలలో హీరో పాత్ర ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది.

ఇక పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.అప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు తెలియని హీరోయిన్లను తీసుకువచ్చి అందచందాలతో అందరినీ మంత్ర ముగ్దులను అయ్యేలా చేస్తూ ఉంటాడు పూరి జగన్నాథ్.

ఇలా ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లనే పూరి టాలీవుడ్ లోకి తీసుకొచ్చాడు అని చెప్పాలి.

పూరి దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి సినిమాలో ఏకంగా ఇద్దరు ముంబయి భామలను తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం చేశాడు.

అమీషా పటేల్, రేణూదేశాయ్ లకు ఈ సినిమాతో మంచి పేరు కూడా వచ్చింది.

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో తను రాయ్ హీరోయిన్ గా పరిచయం చేశాడు.

ఇడియట్ సినిమా తో రక్షితను హీరోయిన్ గా పరిచయం చేదుగా యువతలో తెగ క్రేజ్ సంపాదించింది.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తో ఆసీన్ టాలీవుడ్ లో లాంచ్ చేసింది కూడా పూరిజగన్నాథ్ కావడం గమనార్హం.

"""/" / పూరి సినిమా తో అసిన్ కెరియర్ పూర్తిగా మారిపోయింది.ఇక అందరికీ తెలిసిన అనుష్క శెట్టి అదేనండి మన స్వీటీ పాపను పరిచయం చేసింది కూడా పూరి జగన్నాథ్.

సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈ అందమైన భామ ను పరిచయం చేశాడు.

ఇక దేశముదురు సినిమాతో తెల్లతోలు ముద్దుగుమ్మ హన్సిక టాలీవుడ్ కు పరిచయం చేయగా.

"""/" / ఇప్పుడు కోలీవుడ్ లో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.ఏక్ నిరంజన్ సినిమా తో కంగనా రనౌత్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

నేనింతే సినిమాతో యామి గౌతమ్ ను కూడా తెలుగు తెర మీదకు తీసుకువచ్చాడు.

హార్ట్ ఎటాక్ తో ఆదాశర్మ, లోఫర్ తో దిశాపటాని, ఇజంతో అతిథి ఆర్యాని, పైసా వసూల్ తో ముస్ఖాన్ సేతిని మెహబూబా తో నేహా శెట్టి ని పరిచయం చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు పూరి జగన్నాథ్.