కరోనా నుంచి కోలుకున్నారా..అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి?!
TeluguStop.com
తగ్గిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ వికృత రూపం దాల్చి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న సంగతి తెలిసిందే.
పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరికీ ఈ మహమ్మారి చుక్కలు చూపిస్తోంది.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.కరోనా వైరస్ విజృంభణ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
ఇక కరోనా సోకిన వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.అలాగే కరోనా సోకి కోలుకున్న తర్వాత కూడా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
అవేంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు చూసేయండి.సాధారణంగా కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకునేందుకు ఇమ్యూనిటీ సిస్టమ్‌ను బలపరుచుకోవాలని ప్రయత్నిస్తాయి.
అయితే వైరస్ నుంచి కోలుకోవడానికే కాదు.కోలుకున్న తర్వాత కూడా రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి.
విటమిన్ సి, విటమిన్ ఎ, జింక్, కాపర్, ఐరన్ వంటి పోషకాలు ఉండే ఫుడ్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
"""/"/
కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా జలుబు సమస్య వేధిస్తుంటేరోజుకు ఒకటి, రెండు సార్లు ఆవిరి పడుతూ ఉండాలి.
ఆవిరి పడితే మూసుకు పోయిన మీ ముక్కు రంధ్రాలు ఓపెన్ అవుతాయి.దాంతో చాలా రిలీఫ్‌గా ఉంటుంది.
అలాగే కరోనా తగ్గిపోయింది, ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చాలా మంది మాస్క్ ధరించడం మానేస్తారు.
కానీ, కరోనా నెగిటివ్ వచ్చినా కనీసం వారం, పది రోజుల పాటు మాస్క్ ధరించాలి.
మరియు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి.కరోనా నుంచి కోలుకున్న వారు త్వరగా జీర్ణమయ్యే మరియు తాజాగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
అలాగే తీసుకునే ఆహారంలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బొహైడ్రేట్లు, ఫైబర్ ఇలా అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత నీళ్లు మాత్రమే కాకుండా ఓఆర్‌ఎస్, కొబ్బరి నీరు, మజ్జిగ, హెర్బల్ టీలు తీసుకుంటే డీహైడ్రేట్ కాకుండా ఉంటారు.
ఇక డైలీ డైట్‌లో ఏదో ఒక పండు ఉండేలా చూసుకోవాలి.
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో మలయాళం స్టార్ హీరో నటిస్తున్నాడా..?