అలిగి సాధించిన ‘ ఈటెల ‘ ఆయనకు ఏ పదవి ఇచ్చారంటే ?

ఎటకెలకు హుజురాబాద్ ( Huzurabad )బిజెపి ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ( Etela Rajender )అనుకున్నది సాధించారు.

బిజెపిలో చేరిన తరువాత తన స్థాయికి తగ్గ పదవి ఇవ్వలేదని, తనకు బిజెపి అధిష్టానం పెద్దగా గుర్తింపు ఇవ్వడం లేదని, తెలంగాణ బిజెపి లోను తనకు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారనే కారణాలతో చాలా కాలంగా ఆయన అసంతృప్తితోనే ఉంటున్నారు.

ఒక దశలో ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరిగింది.తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) కు సంబంధించి అన్ని వ్యూహాలు తెలిసిన వ్యక్తి కావడం, టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తి కావడం, కెసిఆర్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనే విషయం తెలిసిన వ్యక్తి కావడంతో, రాజేందర్ ద్వారా కేసీఆర్ కు చెక్ పెట్టాలనే ఆలోచనతో బీజేపీ అధిష్టానం ఉంది.

అయితే ఈ మధ్యకాలంలో రాజేందర్ అసంతృప్తికి గురి కావడంతో, ఆయనను బుజ్జగించేందుకు తాజాగా చేపట్టిన ప్రక్షాళనలో రాజేందర్ కు కీలక పదవిని బిజెపి అధిష్టానం అప్పగించింది.

"""/" / తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్( Bandi Sanjay ) ను తప్పించి, ఆయన స్థానంలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని( Minister Kishan Reddy ) నియమించారు.

దీంతో పాటు ఈటెల రాజేందర్ కు పార్టీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలను అప్పగించారు.

జాతీయ స్థాయిలో పనిచేసే కమిటీ కావడంతో తెలంగాణతో పాటు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలను ఈటెల రాజేందర్ పర్యవేక్షించనున్నారు.

జాతీయ స్థాయిలో తనకు ఈ స్థాయిలో ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడంతో ఈటెల కూడా సంతృప్తిగానే ఉన్నారట.

ఇటీవలే పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, తనకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడం వంటి వ్యవహారాలపై అసంతృప్తికి గురైన ఈటెల రాజేందర్ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.

"""/" / ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పైన ఫిర్యాదు చేశారు.

ఆయనను తప్పించాలని డిమాండ్ చేయడంతో పాటు, సంజయ్ ను కొనసాగిస్తే తాను పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరికలు చేసినట్లుగాను ప్రచారం జరిగింది.

ఆయన కాంగ్రెస్( Congress ) లేదా బిజెపిలో చేరే అవకాశం ఉందని ప్రచారం కూడా బిజెపిలో చోటుచేసుకుంది.

దీంతో బండి సంజయ్ ను తప్పించడంతో పాటు రాజేందర్ కు పార్టీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా అవకాశం బిజెపి అధిష్టానం కల్పించినట్లుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా ప్రాధాన్యం విషయంలో అలక చెందిన రాజేందర్, స్థాయికి తగ్గ పదవిని సంపాదించి తన పట్టుదలను నిరూపించుకున్నారు.

శ్రీవారి దర్శనానికి 25 కిలోల బంగారం ధరించి వచ్చిన భక్తులు..?