అక్షయ తృతీయ రోజు ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలో తెలుసా?

అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాస శుక్లపక్ష మూడవ రోజు వస్తుంది.

ఈ క్రమంలోనే 2021 సంవత్సరంలో మే 14న హిందువులు అక్షయ తృతీయ జరుపు కుంటారు.

ఈ అక్షయ తృతీయ రోజు పెద్ద ఎత్తున లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు.ఇంతటి పవిత్రమైన రోజున మనం ఏ కార్యం నిర్వహించిన మంచి జరుగు తుందని పండితులు చెబుతున్నారు.

ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ప్రజలు పెద్ద ఎత్తున బంగారు నగలు ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు.

అదే విధంగా దానధర్మాలను కూడా చేస్తారు.మరి రాశి ప్రకారం ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయడం వల్ల శుభం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

"""/" / H3 Class=subheader-style*మేష రాశి:/h3p ఈ రాశివారు అక్షయ తృతీయ రోజున ఎర్రటి పప్పు ధాన్యాలను, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పుష్పాలను దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

H3 Class=subheader-style*వృషభం: /h3p ఈ రాశివారు ఆవు దూడ, బియ్యం, నీలి రంగు వస్త్రాలను దానం చేయడం ఎంతో మంచిది.

H3 Class=subheader-style*మిధునం:/h3p మిధున రాశి వారు ఈ రోజు పప్పు ధాన్యాలు, బంగారం, ఆకు పచ్చ రంగులో ఉన్నటు వంటి ఏ వస్తువులైన దానం చేయాలి.

H3 Class=subheader-style*కర్కాటకం: /h3p ఈ రాశివారు ఎంతో పవిత్రమైన ఈ రోజున చక్కెర, పాలు, పెరుగు, వెండి, తెలుపు రంగు వస్త్రాలను, ముత్యాలు వంటివాటిని దానం చేయడం ఎంతో ఉత్తమం.

"""/" / H3 Class=subheader-style*సింహం:/h3p ఈ రాశి వారు కొవ్వొత్తులు, కర్పూరం, రాగి, ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను దానం చేయాలి.

H3 Class=subheader-style* కన్య: /h3p అక్షయ తృతీయ రోజు కన్యా రాశి వారు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మొక్కలు లేదా బట్టలు, కూరగాయలను దానం చేయాలి.

H3 Class=subheader-style*తుల: /h3p ఈ రాశివారు నువ్వులు, మజ్జిగ, పెరుగు, చెప్పులు, నీలిరంగు వస్త్రాలను దానం చేయాలి.

H3 Class=subheader-style* వృశ్చికం: /h3p వృశ్చిక రాశి వారు ఈరోజు గంధం, తిలకం, ఎరుపు రంగులో ఉండే వస్తువులను, వస్త్రాలను దానం చేయడం ఎంతో శుభకరం.

H3 Class=subheader-style* ధనస్సు: /h3p ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున మతపరమైన పుస్తకాలు, పసుపు రంగు బట్టలు, తీపి అన్నం వంటి వాటిని దానం చేయాలి.

H3 Class=subheader-style* మకరం: /h3p మకర రాశి వారు అక్షయ తృతీయ రోజున నల్లటి వస్తువులను, ఇనుమును, నలుపు రంగు వస్త్రాలను దానం చేయాలి.

H3 Class=subheader-style* కుంభం: /h3p ఈ రాశివారు అక్షయ తృతీయ రోజున కొబ్బరి నీళ్ళు, గొడుగు, చెప్పులు ఏడు రకాల ధాన్యాలను దానం చేయాలి.

H3 Class=subheader-style* మీనం: /h3p ఈ రాశి వారు బంగారం లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం ఎంతో మంచిది.

కేసీఆర్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు..!