షర్మిలను చూసి పవన్ తెలుసుకోవాల్సింది ఏంటి  ? 

పార్టీని స్థాపించి దాదాపు ఏడేళ్లు దాటిపోతోంది.  అయినా ఇంకా తప్పటడుగులే రాజకీయంగా పడుతున్నాయి.

ఇంకా జనసేన ను బలోపేతం చేసే విషయంపై పవన్ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి.

  క్షేత్రస్థాయిలో జనసేన కు పెద్ద బలం లేదని,  ఒక రాజకీయ వ్యూహం అనేది లేకపోవడంతో,  అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలు అన్నట్లుగా ఆ పార్టీ విధానం ఉంటోందని,  ఒకవైపు సినిమాలు , మరో వైపు రాజకీయం అన్నట్లుగా పవన్ ప్రస్థానం కొనసాగుతుందనే అభిప్రాయం చాలా కాలం నుంచి ఆ పార్టీ నేతలతో పాటు , రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

అయినా పవన్ ఎప్పుడు ఏదో ఒక పార్టీకి అండగా నిలబడడం తప్ప , సొంతంగా జనసేన బలపడే విధంగా తగిన కార్యాచరణ రూపొందించుకునే విషయంపై దృష్టి సాధించలేకపోతున్నారు.

పార్టీ క్షేత్రస్థాయిలో బలపడాలంటే నిత్యం ప్రజల్లో ఉంటూ,  ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి , వాటిపై ప్రజా పోరాటాలు చేస్తూ,  అధికార పార్టీ , ప్రతిపక్షం అనే తేడాలేకుండా అందరిపైనా, అందరి తప్పులను ఎత్తి చూపిస్తూ ముందుకు వెళితేనే పవన్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని, అలా కాకుండా , ఎప్పుడూ ఏదో ఒక పార్టీ గెలుపు కోసం పవన్ కృషి చేయడం, సంస్థాగతంగా జనసేన బలపడ పోవడానికి కారణాలు అవుతున్నాయి.

  అయితే కొత్తగా తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలను చూసి పవన్ చాలా నేర్చుకోవాలని,  ఆమె పార్టీ పేరున ఇంకా ప్రకటించుకున్న,  తెలంగాణలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టారు.

ఎప్పటి నుంచో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఒత్తిడి వస్తున్న,  పెద్దగా పట్టించుకోకపోవడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగింది ఇదే విషయాన్ని గుర్తించిన షర్మిల , పార్టీ ఏర్పాటు చేయక ముందే నిరుద్యోగ సమస్యపై గళమెత్తారు గత మూడు రోజులుగా ఆమె నిరసన దీక్షలు చేపట్టారు.

  దీంతో తెలంగాణ యువతలో షర్మిల పార్టీపై సానుకూల వైఖరి ఏర్పడింది.రాజకీయంగా ఆమె ఇదే దూకుడు తో ముందుకు వెళ్లాలని,  తెలంగాణలో పేరుకుపోయిన ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి వాటిపై పోరాడాలని నిర్ణయించుకొన్నారు .

అయితే ఎప్పుడో జనసేన పార్టీని స్థాపించిన పవన్ మాత్రం ఏపీలో ఈ తరహ ప్రజా పోరాటాలను ఎంచుకోవడంలో విఫలం అవుతున్నారు.

  """/"/ అప్పుడప్పుడు మాత్రమే అన్నట్లుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం,  కేవలం వైసీపీ ని మాత్రమే టార్గెట్ చేసుకోవడం,  ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న , అధికారంలో ఉన్న ఆ పార్టీ నే టార్గెట్ అన్నట్లుగా వ్యవహరిస్తుండడం,  టిడిపి పై విమర్శలు చేయక పోవడం ఇలా ఎన్నో అంశాలతో ఆయన చంద్రబాబు మనిషిగా ముద్ర వేయించుకున్నారు.

ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న, పవన్ పెద్దగా ఆ పార్టీతో సఖ్యతగా లేరు.

ఎన్నాళ్లు ఆ పొత్తు ఉంటుందో చెప్పలేని పరిస్థితి.మళ్లీ టిడిపితో పొత్తు పెట్టుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు.

ఈ విధమైన విధానాలతో జనసేనను పవన్ ముందుకు తీసుకు వెళితే , రాజకీయంగా ఎప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని ఆయన  చేరుకోలేరని, షర్మిల రాజకీయ వ్యూహాలను  చూసి అయినా పవన్ లో మార్పు రావాలి అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

 .

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?