సంధి కాలంలో జెడి !

లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ( Jayaprakash Narayan ) తర్వాత సివిల్ సర్వీసెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియశీ లకంగా వినిపించిన పేరు జెడి లక్ష్మీనారాయణ .

ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అవినీతి కేసులలో సిబిఐ జెడి గా ఈయన పేరు రాష్ట్రవ్యాప్తంగా సంచలనగా మారింది .

ఆ తర్వాత అనేక సమీకరణాలతో అతికీలకమైన ప్రభుత్వ పదవిని వదిలేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈయన రాజకీయాల దశ దిశ మార్చాల్సిన అవసరం ఉందంటూ అనేక వేదికలపై ప్రసంగించారు.

ఇటువంటి వ్యక్తి పార్టీలో ఉంటే పార్టీకి ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది అని భావించిన జనసేన పార్టీ( JanaSena Party ) ఈయనను విశాఖ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయించింది.

కీలకమైన స్తాయిలోనే ఓట్లను దక్కించుకోగలిగినప్పటికీ చివరికి విజేతగా నిలవలేకపోవడంతో నిలవలేకపోయారు. """/" / అయితే తర్వాత జరిగిన అనేక పరిణామాలతో జనసేన( JanaSena Party )కు దూరమైన ఈయన తన రాజకీయ భవిష్యత్తు కోసం సరైన పార్టీ కోసం అన్వేషించారు.

దేశ రాజకీయాల్లోకి లేటెస్ట్ గా ఎంటర్ అయిన బారాసాలో చేరడానికి ఆయన ప్రయత్నించినప్పటికీ కాలం కలిసి రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో బారాస వెనకడుగు వేయటంతో ఈయనకు సరైన అవకాశం దక్కలేదు.

దానితో ఇప్పుడు ఒంటరి పోరే శరణ్యమని భావిస్తున్న జెడి ( JD )ప్రస్తుతం ఉన్న సాంప్రదాయక రాజకీయ పార్టీలలో తాను ఇమడ లేకపోతున్నందున ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని పార్టీ గుర్తుకాకుండా అభ్యర్థి తీరు చూసి ఓటు వేయండి అంటూ ప్రజలకు పిలుపునివ్వడం విశేషం.

"""/" / నిజానికి అత్యున్నత కేడర్ నుంచి వచ్చిన అధికారులకు పరిపాలనపై స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంలో మాత్రం వెనుక పడుతూ ఉండటం గమనార్హం .

ఆనాడు జేపీ నుంచి ఈనాడు జెడి వరకు రాజకీయ క్షేత్రంలో మాత్రం వెనకబడిపోతుండటం వ్యవస్థలలో ఉన్న బలహీనతలకు లోపాలకు నిర్వచనం గా చెప్పుకోవచ్చు .

నాగబాబు కు కాదు.. మళ్లీ వారికే రాజ్యసభ ఛాన్స్ ?