తేజ ఏం సినిమా చేస్తున్నాడు…రానా మూవీ ఆగిపోయిందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu Film Industry ) తెరకెక్కించగలిగే కెపాబులిటీ ఉన్న దర్శకులలో తేజ( Teja ) లాంటి దర్శకుడు కెరియర్ మొదట్లోనే చిత్రం, నువ్వు నేను, జయం లాంటి వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందించిన ఆయన లవ్ స్టోరీలకు పెట్టింది పేరుగా మారాడు.
ఇక అప్పటినుంచి ప్రతి సినిమా లవ్ స్టోరీనే తీసుకుంటూ రావడంతో ఆయన ఒక జానర్ కి స్టిక్ అయిపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
"""/" /
ఇక ఇప్పుడు రానా( Rana ) ను హీరోగా పెట్టి 'రాక్షస రాజా'( Rakshasa Raja ) అనే సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేసినప్పటికి ఆ సినిమా కూడా మధ్యలో ఆగిపోయిందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా ఏంటి అనే ధోరణిలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు.
ముఖ్యంగా తేజ అభిమానుల నుంచి మరొక సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆయన మరొక సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ( Bellamkonda Srinivas )తో సీత అనే సినిమాను చేశాడు.
మరోసారి అతనితోనే మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా తేజ లాంటి దర్శకుడు కాన్సెంట్రేట్ చేసే సినిమా చేస్తే మాత్రం సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
"""/" /
ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికీ తేజ లాంటి టేస్టు ఉన్న దర్శకులు మాత్రం ఎవరు లేరనే చెప్పాలి.
ఆయన సినిమాలు హిట్ అయిన ఫ్లాపైన ఆయన టోన్ లోనే నడుస్తూ ఉంటాయి.
ఒక సినిమాను చూస్తే అది తేజ సినిమా అని మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు అలాంటి ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న తేజకి అర్జెంటుగా ఒక సక్సెస్ అయితే రావాల్సిన అవసరమైతే ఉంది.