Anchor Suma : అసలు యాంకర్ సుమ చేసిన తప్పేమిటి? మీడియా వాళ్ళ ఓవర్ యాక్షన్ కాకపోతే?

తెల్ల కాగితంలాంటి కల్మషంలేని యాంకర్ సుమ( Anchor Suma )తో ఆఖరికి క్షమాపనలు చెప్పించుకున్నారు.

ఎందుకు? అంత తప్పేం చేసింది? అంటే అక్కడ ఏమీ కనబడలేదు.మీడియా ఓవరాక్షన్ అంతే.

ఈ మధ్య సినిమా జర్నలిస్టులు( Journalists ) తిక్క తిక్క ప్రశ్నలు వేస్తూ జనాలను ఇబ్బంది పెడుతుండడం మనం చూస్తూనే వున్నాం.

వాళ్ల టి‌ఆర్‌పి రేటింగ్స్ కోసమో, వ్యూస్ కోసమో ఇదుగో ఇలాంటి అనవసర కంట్రవర్సీల్లోకి సెలబ్రిటీలను నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

పెద్ద హీరోల జోలికి మాత్రం వెళ్లరు.ఎందుకంటే భయం.

పైగా వాళ్లకు భజనలు చేస్తూ వుంటారు.ఇదుగో ఇలాంటి సుమ వంటి ఆర్టిస్టులపై పెత్తనాలు చెలాయిస్తూ వుంటారు.

"""/" / సుమ ఎటువంటి యాంకర్ అనేది మనం ఏళ్లుగా చూస్తూనే వున్నాం.

ఇన్ని వేల ప్రోగ్రాములు చేసింది కదా, ఎక్కడ కూడా ఆమె నోటి వెంబడి ఒక్క అసభ్యపు మాట తూలదు.

పైగా స్పాంటేనియస్‌గా జోక్స్ వేస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తుంది.ఎవరినీ తక్కువ చేయదు.

అందుకే ఇన్నేళ్లు ఆమె ఫీల్డులో వివాదరహితంగా నిలబడింది.అసలు విషయంలోకి వెళితే, ఒక ఫంక్షన్ లేదా ప్రెస్ మీట్ కి ఆమే హోస్ట్.

మీడియాను లోపలకు ఆహ్వానించే క్రమంలో ‘స్నాక్స్‌ను భోజనంలా చేస్తున్నవాళ్లు త్వరగా లోపలకు రావాలి’ అన్నది.

అది కూడా చాలా సరదాగా ప్రేక్షకుల్ని నవ్వించడానికి అన్నది.అది అంత ఘోరమైన తప్పా.

"""/" / దానికి ఓ సో కాల్డ్ మీడియా పర్సన్‌కు తెగ కోపం వచ్చేసింది.

వాటీజ్ దిస్, నీ యాంకరింగ్ అంటే మాకూ ఇష్టమే, కానీ ఇలా మీడియాను అవమానిస్తావా? అంటూ సుమను అందరి ముందు హెచ్చరించాడు.

దాంతో వారి సంస్కారం అర్ధం చేసుకొని వారికి సారీ చెప్పింది.అది అక్కడితో ముగిసిపోయింది.

అసలు సుమను ఈ సంఘటనలో తప్పుపట్టడమే తప్పు, కానీ సోషల్ మీడియా( Social Media ) వూరుకుంటుందా? ఊరుకోలేదు.

ఎవరికి నచ్చినట్టు వారు ఏవేవో రాసేస్తున్నారు.అయితే కామెంట్లలో చాలామంది సుమకే మద్దతు పలకడం గమనార్హం.

ఐనా సుమ మనస్సు నొచ్చుకున్నట్టుంది, ఆమె మరో వీడియో విడుదల చేస్తూ మళ్లీ సారీ చెప్పింది పాపం.

ఇప్పుడు సమస్య అంతా ఆమె సారీ చెప్పడం కాదు.ఆమె హుందాగానే స్పందించింది.

ఏదీ, ఇలా ఎవరైనా స్టార్ హీరో సరదాగా ఏమైనా కామెంట్ చేస్తే ఇలాగే స్పందిస్తారా ఈ సో కాల్డ్ ఫిలిమ్ జర్నలిస్టులు? అని దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజనం.

వారికి సమాధానం చెప్పండి!.

రెండో బిడ్డ పుట్టాక ఇంటి నుంచి టెంట్‌కి మారిన తండ్రి.. ఎందుకో తెలిస్తే..?