వైరల్ వీడియో: ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..

ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media ) వినియోగం సర్వసాధారణమైపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇక అడవిలో నివసించే జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ నెటిజన్స్ ను ఆశ్చర్యానికి లోను చేస్తుంటాయి.

అచ్చం అలాగే తాజాగా ఒక చిరుత పులిని ఎంతో చాకచక్యంగా బంధించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది.

"""/" / ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రంలోని రంగాపుర గ్రామంలో( Rangapura , Karnataka ) ఐదు రోజులుగా చిరుత అక్కడి గ్రామస్తులను ఇబ్బంది పెడుతూ ఉంది.

తీరా గ్రామస్తులు అందరూ చిరుత గురించి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా అధికారులు అక్కడికి వచ్చి చిరుత పులిని పట్టుకునేందుకు ప్రత్యేకమైన బోన్ ను ఏర్పాటు చేశారు.

"""/" / ఈ క్రమంలో చిరుతను బోనులో బందించెందుకు ప్రయత్నం చేయగా ఆ చిరుత మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేసేసింది.

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి ఎంతో చాకచక్యంగా చిరుత పులి తోకను పట్టుకొని అది ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకొనేసరికి అటవీ శాఖ అధికారుల( Forest Department Officials ) వాళ్ల సహాయంతో చిరుతను చాలా సులువుగా బందించారు.

ఈ తరుణంలో ఆ యువకుడు చిరుతను పట్టుకోవడానికి సహాయం చేసినందుకు అలాగే అధికారులను గ్రామస్తులు అభినందించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొట్టగా నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

కొంతమంది ఆ యువకుడు దైర్యసాహసాల గురించి కామెంట్స్ చేస్తున్నారు.

డాకు మహారాజ్ మూవీ హిందీ వెర్షన్ కు అదే మైనస్ అయిందా.. ఏం జరిగిందంటే?