శోభిత జుట్టు పట్టిన నాగ్.. మరీ పెళ్ళైన రెండు రోజులకే ఇలా ఏంటి గురూ?
TeluguStop.com
సినీనటి శోభిత, నాగచైతన్య( Sobhita, Naga Chaitanya ) వివాహం ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు పలువురు సినీ సెలబ్రిటీల సమక్షంలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.
ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.డిసెంబర్ 4వ తేదీ హిందూ సాంప్రదాయ ఆచారాల ప్రకారం శోభిత మెడలో నాగచైతన్య మూడు ముళ్ళు వేశారు.
ఇలా పెళ్లి తర్వాత ఈ జంట పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.ఈ క్రమంలోనే కొత్త జంటతో కలిసి నాగార్జున( Nagarjuna ) మొదటి సారి శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సాంప్రదాయ దుస్తులను ధరించి నాగచైతన్య శోభిత ఆలయంలోని అమ్మవారికి అలాగే స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలను తీసుకున్నారు.ఇకపోతే నాగార్జున రాకను ఆలయ అధికారులు గోప్యంగా ఉంచారు.
ఈయన హైదరాబాద్ నుంచి నేరుగా కారులో శ్రీశైలానికి చేరుకున్నారు. """/" /
ఇక స్వామివారి దర్శనం అనంతరం వీరు తిరిగి హైదరాబాద్ పయనం కానున్నట్లు తెలుస్తోంది.
తాజాగా శోభిత నాగచైతన్య ఆలయంలో స్వామి వారి కుంకుమ నుదుటన పెట్టుకుంటున్న సమయంలో శోభిత జుట్టు అడ్డు రావడంతో స్వయంగా నాగార్జున తనకు జుట్టు అడ్డురాకుండా పట్టుకున్నారు.
అయితే ఈ ఫోటో పై నెటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.శోభితపై నాగార్జున ఎంతో కేర్ తీసుకుంటున్నారని అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కోడలిలా కాకుండా కూతురిలా చూసుకుంటున్నారు అంటూ అక్కినేని అభిమానులు సంతోషపడగా సమంత అభిమానులు మాత్రం మండి పడుతున్నారు.
"""/" /
సమంత కూడా నాగచైతన్యని పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటి కోడలుగా వెళ్లారు.
అయితే ఏ రోజు కూడా సమంత గురించి నాగార్జున ఇంత పాజిటివ్ గా ఆలోచించలేదని, అలా కనుక ఆలోచించే ఉంటే వారిద్దరు విడిపోకుండా ఎంతో సంతోషంగా కలిసి ఉండేవారు అంటూ సమంత అభిమానులు ఈ ఫోటో పై విమర్శల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
అప్పడాలు అమ్ముతున్న బుడ్డోడు.. రూ.500 ఇస్తానంటే వద్దన్నాడు.. కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే!