Coffee : రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగొచ్చు.. అతిగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసా?
TeluguStop.com
ఉదయం లేవగానే చాలా మందికి కాఫీ( Coffee ) తాగే అలవాటు ఉంటుంది.
కొందరైతే బ్రష్ చేయకుండా కూడా కాఫీ తాగుతుంటారు.దానికి పెట్టిన పేరే బెడ్ కాఫీ.
మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత వేడి వేడిగా ఒక కప్పు కాఫీ తాగకపోతే చికాకుగా అనిపిస్తుంది.
రోజంతా మూడీ గా ఉంటారు.అలాగే కొందరు ఉదయం తో పాటు మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళలో కూడా కాఫీ తాగుతుంటారు.
కాఫీ ఆరోగ్యానికి మంచిదే.కానీ దానికంటూ కొన్ని పరిమితులు ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే రోజుకు ఎన్ని కప్పులు కాఫీ తాగవచ్చు.? అతిగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి.
? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.కాఫీలో కెఫిన్( Caffeine ) ఉంటుంది.
ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.మనలో శక్తి మరియు చురుకుదనాన్ని పెంచుతుంది.
కాఫీ తాగడం వల్ల మైండ్ రిఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. """/"/ ఒత్తిడి( Stress) దూరం అవుతుంది.
ఇటువంటి కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కాఫీని అతిగా తీసుకోకూడదు.రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీని మాత్రమే సేవించాలి.
అంతకుమించి కాఫీ ని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజుకు మూడు కప్పులకు మించి కాఫీ తాగడం వల్ల నిద్రలేమి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాఫీ లో ఉండే కెఫీన్ నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది.అలాగే మూడు కప్పులకు మించి కాఫీ ని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు( Digestion Problems ) తలెత్తుతాయి.
ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, గ్యాస్ మరియు విరేచనాలకు దారితీస్తుంది. """/"/
కాఫీలో ఉండే కెఫీన్ కొందరు వ్యక్తుల్లో రక్తపోటు( Blood Pressure ) మరియు హృదయ స్పందన రేటు పెంచుతుంది.
అంతేకాదు అధికంగా కాఫీ ని తీసుకోవడం వల్ల తరచూ తలనొప్పి బారిన పడతారు.
మైగ్రేన్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.మరియు మానసిక సమస్యలు సైతం తలెత్తుతాయి.
కాబట్టి ఎంత ఇష్టం ఉన్నా సరే కాఫీని లిమిట్‌గానే తీసుకోండి.ఆరోగ్యాన్ని కాపాడుకోండి.