సీట్లు త్యాగం చేసిన వారికి చంద్రబాబు ఏం న్యాయం చేయబోతున్నారు ?
TeluguStop.com
టిడిపిని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు( Chandrababu ) అనేక రాజకీయ ఎత్తుగడలను ఎన్నికలకు ముందు అమలు చేశారు.
వైసీపీ ని ఓడించే వ్యూహంలో భాగంగానే జనసేన, బిజెపిలతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీలు కు సీట్లను కేటాయించారు.
ఈ విధంగా జనసేనకు 21, బిజెపికి 10 అసెంబ్లీ, స్థానాలను కేటాయించారు.అయితే అప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన నేతలు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కచ్చితంగా టిడిపి( TDP ) గెలవాలంటే త్యాగం చేయక తప్పదని , పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మీకు తగిన న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో, టికెట్ పై ఆశలు పెట్టుకుని ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన వారు చంద్రబాబు మాటపై గౌరవంతో తమ సీట్లను త్యాగం చేశారు.
"""/" /
అనుకున్నట్లుగానే ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి( TDP Janasena BJP Alliance ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
పార్టీ అధికారంలోకి రావడంతో, తమ సీట్లను త్యాగం చేసిన 31 మంది టిడిపి నాయకులు తమకు ఏ విధంగా న్యాయం చేస్తారని ఆశిస్తూ చంద్రబాబు పైనే భారం వేశారు.
ఇక చంద్రబాబు సైతం ఈ 31 మందికి పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.తన మాటపై గౌరవంతో సీట్లు త్యాగం చేశారని, వారికి కచ్చితంగా న్యాయం చేయాలని భావిస్తున్నారట.
అయితే పార్టీ పదవులు లేకపోతే ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇచ్చి టికెట్ దక్కని వారిని సంతృప్తి పరచాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
"""/" /
ఇప్పటికిప్పుడు ఆ పదవుల భర్తీ చేపట్టే అవకాశం లేదని, ప్రస్తుతం పాలన పైనే దృష్టి సారించడంతో మరి కొంతకాలం వారికి వెయిటింగ్ తప్పదని టిడిపి కీలక నేతలు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం ఈ 31 మందికి పార్టీ పదవులు , నామినేటెడ్ పదవులు ఇచ్చినా పార్టీలో మిగిలిన నాయకుల నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండవని చంద్రబాబు అంచనా వేస్తున్నారట.
అందుకే ముందుగా వీరికి పదవులు ఇచ్చే విషయంపైనే ఫోకస్ చేసినట్లు సమాచారం.
భార్య కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకున్న కమెడియన్.. ఈ భర్త నిజంగా గ్రేట్!