వైఫై కాలింగ్‌కు సంబంధించిన ఈ విషయాలు మీకు తెలుసా?

వైఫై కాలింగ్‌ని ఉపయోగించే వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ముఖ్యంగా కనెక్టివిటీ సరిగా లేని ప్రదేశాలలో వైఫై కాలింగ్‌ని ఉపయోగిస్తున్నారు.

అయితే దీనిలో రెండు ముఖ్యమైన కండీషన్స్ ఉన్నాయి.ముందుగా టెలికాం ఆపరేటర్ తప్పనిసరిగా వైఫై కాలింగ్‌కు సపోర్ట్ చేయాలి.

రెండవది, నెట్‌వర్క్ వైఫై కనెక్షన్‌కు సపోర్ట్ చేయాలి.ఇంతకీ వైఫై కాలింగ్ అంటే ఏమిటి? దాని ఛార్జ్ ఏమిటి? అనేది తెలుసుకుందాం.

గాడ్జెట్స్‌నౌ తెలిపిన వివరాల ప్రకారం వైఫై కనెక్షన్ ద్వారా కాల్ చేయడాన్ని వైఫై కాలింగ్ అంటారు.

మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నప్పటికీ వైఫై కనెక్టివిటీ బాగున్న ప్రదేశాలకు ఈ రకమైన కాల్ ఉపయోగపడుతుంది.

ఇక్కడ విశేషమేమిటంటే.వీడియో కాలింగ్‌ మాత్రమే కాకుండా వై-ఫై కాలింగ్‌తో ఆడియో కాల్స్ కూడా చేయవచ్చు.

దీని కోసం, వినియోగదారు వైఫై కాలింగ్‌కు సపోర్ట్ చేసే పరికరం, నెట్‌వర్క్‌ను కలిగి ఉండాలి.

వైఫై నెట్‌వర్క్ కూడా బలంగా ఉండాలి, తద్వారా కాలింగ్ సమయంలో మెరుగైన కనెక్టివిటీ ఉంటుంది.

వైఫై కాలింగ్ కోసం వినియోగదారు నుండి ప్రత్యేక ఛార్జీ ఏమీ ఉండదు.వినియోగదారు ఇంటర్నెట్ కనెక్షన్ బిల్లులో ఛార్జీ ముందుగా లింక్ అయివుంటుంది.

అందుకే కాల్ చేసే ముందు మీ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్ ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి.

ఇటీవల విడుదల చేసిన అనేక స్మార్ట్‌ఫోన్‌లలో వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది.ఈ రకమైన కాల్ చేయడానికి మీరు మీ మొబైల్‌లోని సెట్టింగ్‌లను మార్చవచ్చు.

గూగుల్ బ్లాగ్ తెలిపిన వివరాల ప్రకారం దీని కోసం ముందుగా సెట్టింగ్‌లకు వెళ్లి కాల్స్ ఎంపికపై నొక్కండి, వై-ఫై కాలింగ్‌ని ఎంచుకోండి.

మీ ఫోన్‌లో ఈ ఎంపిక కనిపించకపోతే, అది ఈ ఫీచర్‌కు సపోర్ట్ చేయడం లేదని అర్థం.

సెట్టింగ్ పూర్తయిన తర్వాత, వినియోగదారు ఫోన్‌ను ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేసినప్పుడు, అతను ఇంటర్నెట్ కాలింగ్ లేదా వైఫై కాలింగ్ కోసం స్క్రీన్‌పై నోటిఫికేషన్‌ వస్తుంది.

అప్పుడు వినియోగదారుని ఫోను వైఫై కాలింగ్‌కు సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు.

గేమ్ చేంజర్ సినిమా మీద శంకర్ కాన్ఫిడెంట్ ఏంటి..?