Prashanth Varma : అప్పుడే సక్సెస్ తలకెక్కిందా ? ఎంటి ఈ బుర్ర లేని కామెంట్స్ ప్రశాంత్ వర్మ 

హనుమాన్ సినిమా( Hanuman Movie ) చాలా బాగుంది.మెరిట్ తో పాటు లక్కు కూడా తోడైంది.

దాంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వచ్చిన మొట్టమొదటి ప్రశాంత్ వర్మ సినిమా కలెక్షన్స్ కురిపిస్తుంది.

ఇది నిజంగా మంచి విషయమే.అలాగే ఈ సినిమా తర్వాత దాదాపు 12 వరుస ఆధ్యాత్మిక సినిమాలు చేస్తానని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు.

ఇది మరీ మరీ మంచి విషయం.ఎందుకంటే ఒక క్లారిటీతో ఉంటే అది అతని కెరీర్ కి ఉపయోగపడుతుంది.

ఇక తను తీయబోయే మరో సినిమాలో బాలకృష్ణ, రానా వంటి పెద్ద హీరోలు ఉన్నారు.

ఇది కూడా అద్భుతమైన విషయమే.అయితే ప్రశాంత్ వర్మ తనకు వచ్చిన సక్సెస్ కిక్కును ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు.

"""/" / అందుకే ఒక చీప్ కామెంట్ చేశాడు.ఆది పురుష్ సినిమా( Adipurush ) చాలా చెత్తగా తీశాడు ఆ డైరెక్టర్.

నేనైతే ఇంకా బాగా తీసేవాన్ని.కొన్ని సీన్స్ అస్సలు బాగోలేవు.

కేవలం రాముడి కోసమైనా వెళ్లి చూడాలనుకున్న కానీ రామ భక్తులు సైతం ఈ సినిమాను తిడుతున్నారు.

అంటూ ఆ చిత్ర దర్శకుడు ఓం రైత్ ని తిట్టేసాడు.ఒక సినిమా అందరికీ నచ్చకపోవచ్చు.

ఎవరికి క్రియేటివిటీ వారిది ఆ టైంలో ఆదర్శకుడికి, హీరోకి, నిర్మాతకు నచ్చిన సినిమా ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.

చాలాసార్లు ఇలాంటి అనుభవాలు వస్తూనే ఉన్నాయి.మనం చూస్తూనే ఉన్నాం.

కానీ నేనైతే బాగా తీసేవాడిని అని ఒక చీప్ కామెంట్ చేయడం ప్రశాంత్ వర్మ కు సక్సెస్ తనకు ఎక్కిన కిక్కు తర్వాతే వచ్చింది అని అనుకోవచ్చు.

"""/" / ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తీసిన సినిమా అందరికీ నచ్చింది కావచ్చు.

కానీ భవిష్యత్తులో ఆయన తీసే ప్రతి సినిమా అందరికీ నచ్చుతుంది అని రూల్ ఏమీ లేదు కదా.

రేపటి రోజు ఎవరో ఒకరు వచ్చి ప్రశాంత్ వర్మ చిత్రంలోని ఆ సీన్ నేనైతే బాగా తీసే వాడిని అంటే ఎలా ఉంటుంది.

అందుకే ఎవరి క్రియేటివిటీ స్పేస్ వాళ్లకు ఇచ్చేయాలి.ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఒక ప్రోటోకాల్ మరియు మర్యాద అనేవి ఉంటాయి కదా.

"""/" / అవి పాటిస్తే ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) భవిష్యత్తులో మంచి సక్సెస్ అందుకుంటాడు.

అతని సినిమా గొప్పగా ఉంది అని అనుకోవడానికి కూడా లేదు.హనుమాన్ సినిమాలో కూడా ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి.

మరి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని తప్పుగానే కనిపిస్తాయి.

పెళ్లి వేడుకలో ఊహించని ట్విస్ట్.. వరుడి ఫ్రూటీలో రమ్ము కలిపిన స్నేహితుడు.. తర్వాతేమైందో మీరే చూడండి!