కేసీఆర్ బ్రాండ్‌కు జాతీయ‌నేత‌ల్లో ఉన్న వాల్యూ ఏంటీ ?

నేల విడిచి సాము చేయాల‌నుకుంటే అప‌సోపాలు ప‌డ‌క‌ మాన‌దు.తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాష్ట్రం దాటి ఇత‌ర రాష్ట్రాల్లో రాజ‌కీయం చేయాల‌నుకుంటే అందుకు త‌గ్గ‌ట్టు గ్రౌండ్ వ‌ర్క్ చేయాలి.

ఎవ‌రితో ఎలా మెల‌గాలి ? ఎలా కంట్రోల్ చేయాలి ? ఎలా మ‌చ్చిక చేసుకోవాలో తెలిసి ఉండాలి.

రాష్ట్ర రాజ‌కీయాలు అవ‌పోష‌న ప‌ట్టినా జాతీయ‌రాజ‌కీయ‌ల్లో ఆరంగేట్రంచేయాల‌నుకోవ‌డం తేలికైన విష‌య‌మేమీ కాదు.సీఎం కేసీఆర్ మాదిరిగానే చాలామంది ప్రాంతీయ నేత‌ల‌కు రాష్ట్ర అవ‌స‌రాలు, ప్రాధామ్యాలు ఉంటాయి.

వాటిని విస్మ‌రించ‌కుండా ఒక్క‌తాటిపైకి తీసుకురాగ‌ల‌గాలి.ఇదంతా నాణానికి ఒక‌వైపు మాత్ర‌మే.

మ‌రో వైపు బోలెడు ఉంటాయ‌న్న‌ది గుర్తెర‌గాలి.పేరు ప్ర‌ఖ్యాతు, కీర్తిప్ర‌తిష్ట‌ల కోం వెంప‌ర్లాడే వారే కోకొల్ల‌లు ఉంటారు.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో కేంద్రంలో సోనియాగాంధీ ఉన్నారు కాబట్టి, తాను ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌న్న త‌ప‌న‌తో రాష్ట్రం సిద్ఙించింది.

రాష్ట్ర ఏర్పాటుపై ఆమెకున్న సానుభూతి కూడా ఇందుకు ఒక కార‌ణ‌మైంది.అందుకే తెలంగాణ అంశం సున్నిత‌మైందైనా .

మొండిగా వ్య‌వ‌హ‌రించి తెలంగాణ రాష్ట్ర క‌ల సాకారం చేశారు.ఎవ‌రెన్ని చెప్పినా నాడు కేంద్రంలో సోనియా ఉండ‌డం, ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు త‌లంచ‌డం అన్నీ జ‌రిగ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంది.

సీఎం కేసీఆర్‌కంటే ప‌దిరెట్లు శ‌క్తి వంత‌మైన నేత‌ల‌ను బోల్తా కొట్టించే మాస్ట‌ర్ విలన్  ఆ స్థాయి నేత‌ల వ‌ద్ద ఉంటుంది.

ఇదంతా విస్మ‌రించి తెలివి ఉంది క‌దా అని ఆకాశానికి నిచ్చెన వేయాల‌ను కుంటే స‌మ‌స్య‌ల్లో చిక్కుకోక త‌ప్ప‌దు.

"""/" / సీఎం కేసీఆర్ రాజ‌కీయాల‌ను ఒక‌సారి నిశితంగా ప‌రిశీలిస్తే ఆయ‌న ఎవ‌రితో జ‌త క‌డ‌తాడో ? ఆత‌ర్వాత రోజుల్లో వారిని తిట్టిపోయ‌డం కేసీఆర్‌కే సొంతం.

ఇచ్చిన మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తి కేద‌నే టాక్ కూడా ఉంది.తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్  విలీనం చేస్తామ‌ని చెప్పి మాట త‌ప్పిన సంగ‌తి విధిత‌మే.

తెలంగాణ సీఎం హోదాలో జాతీయ‌స్థాయిలో అత‌ని కంటూ స‌హ‌చ‌రులు ఎవ‌రూ లేరు.జాతీయ‌స్థాయిలో అంటే రెండు మూడు రాష్ట్రాల సీఎంల‌తో స‌న్నిత సంబంధాలు ఉండాలి.

అవేమీ కేసీఆర్‌లో క‌నిపించ‌డం లేదు.మొత్తంగా కేసీఆర్ బ్రాండ్ త‌ల‌చుకుంటే రాష్ట్ర సాధ‌కుడిగా త‌ప్ప న‌మ్మ‌క‌స్తుడు అనే మాట ఎక్క‌డా విన‌ప‌డ‌దు.

మ‌రి జాతీయ‌స్థాయి రాజ‌కీయాల్లో ఇత‌ర పార్టీల అధినేత‌లు సీఎం కేసీఆర్‌ను ఎంత‌మేర నమ్ముతారు ? ఎవ‌రు జ‌త క‌డ‌తారు ? అనేది చూడాల్సిందే.

కెనడా: భారతీయ వలసదారులను తిట్టిన మహిళ.. కడిగిపారేసిన నెటిజన్లు..