హిందూల పెళ్లిలో 'గరికె ముంత'ను ఎందుకు వాడుతారో తెలుసా? దాని చరిత్ర తెలుసుకుందామా?
TeluguStop.com
హిందువుల పెళ్లిలు అత్యంత విభిన్నంగా, హంగు ఆర్భాటాలతో జరుగుతాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
క్రిస్టియన్స్ పెళ్లి సింపుల్‌గా చర్చిలో రింగ్స్ మార్చుకోవడంతో పూర్తి అవుతుంది.ఇక ముస్లీంల పెళ్లి కూడా హడావుడి లేకుండా సింపుల్‌గానే జరిగి పోతుంది.
కాని హిందువుల పెళ్లి హడావుడి అంతా ఇంతా ఉండదు.అత్యంత విభిన్నమైన సాంప్రదాయాలు ప్రతి కార్యక్రమంకు ఒక ఛారిత్రాత్మక కథ ఉంటాయి.
హిందువుల పెళ్లికి సంబంధించిన పలు తంతులు ఉంటాయి. """/"/
ఒకప్పుడు ఏకంగా నాలుగు రోజుల పెళ్లిలు ఉండేవి.
కాని ఇప్పుడు పరిస్థితి మారింది.కేవలం ఒక్క రోజులోనే పెళ్లిలు అవుతున్నాయి.
రోజులు తగ్గినా కూడా సాంప్రదాయాలు మాత్రం అలాగే ఉన్నాయి.హిందువులు జిలకర బెల్లం పెట్టుకోవడం, కాలికి మెట్టెలు పెట్టుకోవడం, ఇంకా తలంబ్రాలు పోసుకోవడం వంటివి మొదటి నుండి వస్తున్నాయి.
వాటిని ఏ ఒక్కరు వదలకుండా కంటిన్యూ చేస్తున్నారు.ఇక హిందూ పెళ్లిలో చాలా కీలకంగా చెప్పుకునే గరికె ముంత గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం.
"""/"/
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి సౌత్ రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన కూడా కొన్ని రాష్ట్రాల్లో హిందువులు తమ పెళ్లిల్లో గరిక ముంతను వాడుతారు.
దీనికి వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉన్నాయి.గరికె, గరిక, గరిగె అంటూ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.
ఏ పేరుతో పిలిచినా కూడా ఒకే ఉద్దేశ్యంతో దాన్ని పెళ్లిల్లో వాడుతూ ఉంటారు.
గరికెను పూజించడం అనేది అమ్మవారిని పూజించడం వంటిదని పెద్దలు అంటూ ఉన్నారు.పెద్దల మాట ప్రకారం కొత్త దంపతులకు గరికె అమ్మవారిల ఆశీర్వాదం ఇస్తుంది.
"""/"/
ద్రౌపతి తన పెళ్లి సమయంలో ఆనందం ఇంకా ఉత్సాహంతో పక్కన ఉన్న ఒక మట్టి కలశంను నెత్తిన పెట్టుకుని డాన్స్ వేసిందట.
ఆ విధంగా మట్టి కలశంలు పవిత్రతను పొందాయి.భూమాత నుండి సేకరించిన మట్టితో గరికెను తయారు చేస్తారు కనుక ఆ మాత కటాక్షం కూడా దక్కుతుందని పెద్దలు నమ్ముతు ఉంటారు.
గరికె ముంత అనేది ఏది పడితే అది వాడకుండా, పెళ్లికి ముందు రోజున కుమ్మరి ఇంటి నుండి తీసుకు వచ్చి ఉపయోగిస్తారు.
కుమ్మరి లేని వారు షాప్‌లో కొనుగోలు చేసి తెలిసిన వారి ఇంట్లో పెట్టి పెళ్లికి ముందు రోజు మేళ తాళాలతో వెళ్లి దాన్ని తీసుకుని వస్తారు.
అబ్బాయి పెళ్లి సమయంలో గరికె ముంతను పట్టుకుని పెళ్లి పీఠల మీదకు చేరతాడు.
ఆ తర్వాత తలంబ్రాలు, అక్షింతలు ఇలా ప్రతి పెళ్లి వస్తువుకు గరికె ముంతతో శుద్ది చేసి, పవిత్రతను కల్పించడం కోసం వాటిని గరిక ముంతతో టచ్ చేయిస్తారు.
వివాహం జరిగినంత సమయం కూడా పెళ్లి వేదికపై గరిక ముంత ఉంటూనే ఉంది.
పెళ్లి తర్వాత కూడా నూతన వధు వరులు ఆ గరికె ముంతను జాగ్రత్తగా భద్రపర్చుకుంటారు.
ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారు ఆ గరికె ముంతను అలంకరించుకుని పెళ్లిలో వాడుతూ ఉంటారు.
సాదారణ తరగతి వారు రంగు పూసి బొట్టు పెట్టి ఉపయోగిస్తారు.అమ్మవారి ఆశీర్వాదంను గరికె ముంత ఇస్తుందని అందరి నమ్మకం.
తమిళ సినిమాలకు అలా తెలుగు సినిమాలకు ఇలా.. అనిరుధ్ కు ఇది న్యాయమేనా?