బాలయ్య బర్త్ డే స్పెషల్ ఏంటీ?
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ వచ్చి ఉండకుంటే ఇప్పటి వరకు అఖండ సినిమా వచ్చి ఉండేది.
కాని సెకండ్ వేవ్ వల్ల కనీసం షూటింగ్ కూడా పూర్తి అవ్వలేదు.ఇక బాలయ్య తదుపరి సినిమా చిత్రీకరణ మొదలు అవ్వాల్సి ఉన్నా కూడా అది కూడా జరగలేదు.
కరోనా సెకండ్ వేవ్ వచ్చి ఉండకుంటే నందమూరి అభిమానుల కోసం బాలయ్య ఈ బర్త్ డే కు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టీజర్ ను విడుదల చేసి ఉండేవారు.
కాని ఇప్పటి వరకు ఆ సినిమా ప్రారంభం కాలేదు కనుక ఫస్ట్ లుక్ ఏది విడుదల చేయడానికి లేదు.
కాని బాలయ్య బర్త్ డే సందర్బంగా ఏదో ఒక సర్ ప్రైజ్ మాత్రం రావడం ఖాయం అంటున్నారు.
ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్బంగా శ్రీరామ దండకం ను బాలయ్య స్వయంగా ఆలపించి విడుదల చేశాడు.
తన బర్త్ డే సందర్బంగా అలాంటి ప్రయోగం ఏమైనా చేస్తాడా లేదంటే కొత్తగా అఖండ సినిమా గురించి ఏదైనా ప్రత్యేక ఎలిమెంట్ ను రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
అభిమానులు మాత్రం బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా అఖండ నుండి మొదటి పాట వస్తే బాగుంటుందని అంటున్నారు.
పాట విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదు.కాని సినిమా విడుదల ఇంకా చాలా సమయం ఉండగా ఇప్పుడే పాట విడుదల చేస్తే సినిమా పై బజ్ తగ్గుతుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి నందమూరి బాలయ్య బర్త్ డే రోజున ఏం జరుగ బోతుంది.స్పెషల్ ఏంటీ అనేది ఆసక్తిగా మారింది.
ఇంకా మూడు రోజులే .. ఈ ముగ్గురూ బిజి బిజీ