BJP: బీజేపీ హ్యాండ్ ఇచ్చేలా ఉందే..? టీడీపీ జనసేన పరిస్థితేంటి ?
TeluguStop.com
బిజెపితో పొత్తు విషయంలో టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పార్టీలు చాలా ఆశలతోనే ఉన్నాయి.
ఏపీలో ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోయినా, కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడం, కేంద్ర బీజేపీ( BJP ) పెద్దల మద్దతు ఉంటే తమకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని, అలాగే ఎన్నికల సమయంలోనూ బిజెపి సహకారం తప్పనిసరిగా కావాల్సిందేనని, అప్పుడే అధికార పార్టీ వైసీపీని మరింత సమర్థవంతంగా డీ కొట్టగలమని టిడిపి , జనసేన పార్టీలు భావిస్తున్నాయి.
ఇప్పటికే బీజేపీతో పొత్తు విషయమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ).
తాజాగా ఈ పొత్తుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
"""/" /
బిజెపితో పొత్తు కోసం తాను జాతీయ నేతలతో చివాట్లు తిని మరీ పొత్తుకు ఒప్పించానని కొద్ది రోజుల క్రితమే బహిరంగ సభలో చెప్పారు.
టిడిపి, బిజెపి నుంచి మాత్రం ఈ పొత్తు విషయమై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
దీంతో టీడీపీ, జనసేన తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను మరి కొంతకాలం వాయిదా వేసింది.
ఈనెల 28వ తేదీన టిడిపి, జనసేన ఎన్నికల సమాయత్తంలో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయదలచాయి.
అయితే ఆ సభ కంటే ఒకరోజు ముందుగానే బిజెపి మరో సభను నిర్వహించేందుకు నిర్ణయించింది.
పొత్తులతో సంబంధం లేకుండా, అన్ని నియోజకవర్గాల్లో బిజెపి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఆ పార్టీ ప్రకటించింది.
దీంతో టిడిపి, జనసేనతో పొత్తు ఉంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. """/" /
బిజెపి నిర్వహించబోయే ఈ సభకు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ( Union Minister Rajnath Singh )హాజరు కాబోతున్నారు.
ఈ సభ గురించి పురందరేశ్వరి ప్రకటన చేశారు.ఒత్తుల విషయం ఎలా ఉన్నా.
అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లుగా వెల్లడించారు.అధిష్టానం సూచన మేరకే ఈ సభను నిర్వహిస్తున్నామని పురందరేశ్వరి చెబుతున్నారు.
దీంతో బిజెపి తమకు హ్యాండిచ్చేలా వ్యవహరిస్తోందని టిడిపి, జనసేన లు అనుమానిస్తున్నాయి.అయితే బీజేపీ తమతో కలిసి రాని పక్షంలో, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో రెండు పార్టీలు ఆలోచనలో పడ్డాయి.
యవ్వనంగా కనిపిస్తున్న ఈమె వయసు తెలిస్తే షాకే.. ఆమె తినేది ఏంటంటే..?