శంకర్ భారతీయుడు 3 పరిస్థితి ఏంటి..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లు హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న శంకర్( Director Shankar ) లాంటి దర్శకుడు సైతం గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో భారీగా డీలాపడిపోయాడు.
ఇంకా ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ తో భారతీయుడు 3( Bharateeyudu 3 ) అనే సినిమాని చేస్తున్నాడు.
గత సంవత్సరం వచ్చిన భారతీయుడు 2 సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
"""/" /
దాంతో ఈ సినిమా మీద కూడా పెద్దగా అంచనాలైతే లేవు.
మరి దానికి తగ్గట్టుగానే శంకర్ ఈ సినిమాని చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఈ సినిమాతో కనుక సూపర్ సక్సెస్ సాధిస్తే శంకర్ మరోసారి ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటాడు.
లేకపోతే మాత్రం భారీగా డీలపడిపోయే అవకాశాలోతే ఉన్నాయి.ఇక తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోలేని పక్షాన శంకర్ కి బ్యాడ్ నేమ్ రావడమే కాకుండా ఇక ఆయన సినిమాలు నుంచి రిటైర్మెంట్ ప్రకటించవచ్చు అని చాలామంది హేళన చేసే అవకాశాలైతే ఉన్నాయి.
తను ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంటుందనే స్థాయి నుంచి ఆయన సినిమా వస్తుంది అంటే అది ఫ్లాప్ సినిమాగా మిగిలబోతుందనే స్థాయికి దిగజారిపోయిన శంకర్ మరోసారి పూర్వ వైభవం సంపాదించుకోవాలంటే మాత్రం భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
"""/" /
ఇక ఏది ఏమైనా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు మనుగడిని కొనసాగిస్తారు.
శంకర్ కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సంపాదించుకుంటు ముందుకు సాగుతున్నప్పటికి ఆయన ఈ సమయంలో డీలపడిపోవడం అనేది నిజంగా చాలా బ్యాడ్ విషయమనే చెప్పాలి.
చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ ఎవరు..?