దేవర, పుష్ప 2 లా పరిస్థితి ఏంటి..? ఇవి రెండు హిట్టు అవుతాయా..?
TeluguStop.com
సినిమాని తీయాలంటే దర్శకుడికి సినిమా డైరెక్షన్ మీద అవగాహన ఉండాలి.ఏ మాత్రం అవగాహన లేకుండా మేము కూడా సినిమా తీసేస్తాము అని ముందుకొస్తే మాత్రం ఆ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా ప్రొడ్యూసర్స్ కి భారీ నష్టాలు మిగిల్చే అవకాశాలు కూడా ఉంటాయి.
అందువల్లే డైరెక్షన్ కి సంభందించిన అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాతే సినిమా డైరెక్షన్ చేయాలి.
అయితే కొంతమంది మాత్రం సినిమా డైరెక్షన్ తో సంబంధం లేకుండా వరుస కో డైరెక్టర్ ను పెట్టుకొని సినిమా తీసివేయచ్చు అనే భ్రమలో ఉంటారు.
అది కూడా వర్కౌట్ కాదు.ఇక మొత్తానికైతే ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం నిలవలేరనేది వాస్తవం.
"""/" /
ఇక ఇదిలా ఉంటే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మన రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ( Rajamouli, Sukumar, Koratala Siva ) లాంటి వాళ్ళు ప్రస్తుతం మన ఇండస్ట్రీ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక ఇందులో రాజమౌళి ఇప్పటికే పాన్ ఇండియా స్టేజ్ దాటేసి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో సుకుమార్, కొరటాల శివ మాత్రం ఇప్పుడు మరోసారి వాళ్ళ సత్తా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నారు.
ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం వస్తున్న అతిపెద్ద సినిమాల్లో దేవర, పుష్ప 2 ( Devara, Pushpa 2 )సినిమాలు భారీ అంచనాలను పుట్టిస్తున్నాయి.
ఇక దేవర సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి షూట్ ను తొందర్లోనే కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని చాలా తొందరగా ఫినిష్ చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక పుష్ప 2 సినిమా కూడా డిసెంబర్ 6 ఓ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
అయితే ఈ రెండు సినిమాలు పాన్ ఇండియాలో భారీ వసూళ్లను రాబడతాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక పాన్ ఇండియాలో ఈ రెండు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తే మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తుందనే చెప్పాలి.
సన్ ఫ్లవర్ సీడ్స్ తో ఇలా చేశారంటే ఏజ్ పెరిగిన యవ్వనంగా మెరిసిపోతారు!