మద్యానికి బానిసైన ఉపాధ్యాయుడు…స్కూల్లో పిల్లల పరిస్థితి ఏంటి…!

సూర్యాపేట జిల్లా:విద్యార్థి తప్పు తోవలో నడిస్తే ఆ విద్యార్థిని మంచి నడవడిలోకి తీసుకొచ్చేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే.

ఎందుకంటే గురువు మాట విని చెడిపోయిన వాడు ఈలోకంలో లేడు.ఎలాంటి వారినైనా మార్చగలిగే శక్తి కేవలం టీచర్ కు మాత్రమే ఉంటుంది.

బతుకు పాఠాలు నేర్పించాల్సిన అలాంటి ఉపాధ్యాయుడే చెడు వ్యసనాలకు బానిసైతే ఆ విద్యార్థుల పరిస్థితి ఏం కావాలి.

?సూర్యాపేట జిల్లా మోతె మండలం రామాపురం తండాలో మద్యానికి బానిసైన ఉపాధ్యాయుడు ప్రతిరోజు పాఠశాలకు తాగి వస్తూ పిల్లలను చదువును నాశనం చేస్తున్నాడు.

ఈ ఉపాధ్యాయుడి గురించి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోవడంతో తాగి ఊగుతున్న ఉపాధ్యాయుడి వీడియో తీసి సోషల్ మీడియా పెట్టారు.

దీనితో ఆ వీడియో వైరల్ గా మారింది.ఇప్పటికైనా జిల్లా విద్యా శాఖ అధికారులు స్పందించి మద్యానికి బానిసైన సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని గ్రామస్థులు,విద్యార్థులు కోరుతున్నారు.

వామ్మో.. బాలయ్యలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ఈ విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!