నవరాత్రులలో తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని ప్రాముఖ్యత ఏమిటంటే..?

నవరాత్రులలో తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని ప్రాముఖ్యత ఏమిటంటే?

ముఖ్యంగా చెప్పాలంటే శరన్నవరాత్రులలో( Navaratri ) భాగంగా తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి సోమవారం రోజు మహర్షవమిగా ప్రాశస్త్యం పొందిందని పండితులు చెబుతున్నారు.

నవరాత్రులలో తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని ప్రాముఖ్యత ఏమిటంటే?

ఈ రోజు అమ్మవారి అలంకారం మహిమాన్వితమైన మహిషాసుర మర్దిని దేవి అవతారం అని పండితులు చెబుతున్నారు.

నవరాత్రులలో తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని ప్రాముఖ్యత ఏమిటంటే?

అమ్మవారు ఉగ్రరూపంతో ఆ చేతిలో త్రిశూలం తో సింహవాహిని దుష్టశిక్షణ గావిస్తూ ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే మహిషాసురుడనే రాక్షసుడు శివుని దగ్గర అమరత్వాన్ని వరంగా పొంది ఇంద్రుడిని ఓడించి దేవతలకు కూడా హాని తలపెట్టడంతో అందరూ శివకేశవుల దగ్గరకు వెళ్లి రక్షించమని వేడుకుంటారు.

సమస్త దేవతల నుంచి శక్తి వెలువడి ప్రత్యక్షమైనా ఉగ్ర మూర్తిగా మహిషాసురున్ని( Mahishasura ) యుద్ధానికి ప్రేరేపించే దుష్టశక్తిని అణిచివేయాలనుకుంది.

"""/" / ఇంకా చెప్పాలంటే అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు పోరు జరిగి ఆశ్వయుజ శుక్లా నవమి దినమున ఆ రాక్షసుని అంతమొందించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించింది.

కొన్ని ప్రాంతాలలో అమ్మ వారిని ఈ రోజు సిద్ధి ధాత్రిగా పూజలు చేస్తారు.

అలాగే దుర్గామాత తొమ్మిదో శక్తి రూపం సిద్ధి ధాత్రి అని చాలా మందికి తెలియదు.

ఈమె సర్వ సిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం అని పండితులు చెబుతున్నారు.పరమేశ్వరుడు( Lord Shiva ) సర్వ సిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్లుగా దేవి పురాణంలో ఉంది.

ఈ రోజున త్రిరాత్ర వ్రతం కొనసాగిస్తారు. """/" / బొమ్మలకు పేరంటం జరుపుతారు.

కొన్ని ప్రాంతాల వారు వాహన పూజ మహానవమి రోజు చేసుకుంటారని పండితులు చెబుతున్నారు.

పరమేశ్వరిని మహిషాసుర మర్ధని అవతారంలో అనేక విధాలుగా పూజించి జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధని శైలసుతే అని కొలుస్తారు.

ఉగ్రమూర్తిగా ఉన్న అమ్మ వారికి వడపప్పు, పానకం, చలిమిడి పులిహార, గారెలు, నిమ్మరసం నివేదన చేసి శాంతింప చేస్తారు.

మహిషాసురమర్ధిని స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు.

ఈ రోజు ధరించాల్సిన వర్ణం కాఫీ రంగు అని కూడా చెబుతున్నారు.

భార్యకు విడాకులు ఇచ్చి హీరోయిన్ తో ప్రేమాయణం.. జీవీ ప్రకాష్ తెర వెనుక కథ ఇదేనా?