మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

ఏ శుభకార్యం అయినా ఏ దైవ కార్యం అయిన కొబ్బరి కాయ లేనిదే జరగదు.

మొదట కొబ్బరి కాయ కొట్టి ఏ కార్యాన్ని అయినా ప్రారంభించటం అనాదిగా ఒక ఆచారంగా వస్తుంది.

దేవుడికి కొబ్బరి కాయ కొట్టి ఆ నీటితో అభిషేకం చేసి ఆ కొబ్బరి చెక్కలను నైవేద్యంగా పెడతారు.

పూజలు,వ్రతాల సమయంలో కొబ్బరి కాయను కొట్టి నివేదన చేస్తారు.భారతీయ పూజ విధానంలో కొబ్బరికాయకు ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది.

కొబ్బరికాయకు మూడు కనులు ఉండుట వలన ముక్కంటి కాయ అని కూడా అంటారు.

కొబ్బరికాయను కొట్టినప్పుడు రెండు ముక్కలుగా అవుతుంది.ఈ రెండింటిని జీవుడు దేవుడికి ప్రతీకగా భావిస్తారు.

కొబ్బరికాయకి గల మూడు కన్నుల్లోను 'బ్రహ్మనాడి'గా చెప్పుకునే పై భాగంలోని కన్ను నుంచి మాత్రమే నీరు బయటికి వస్తుంది.

'బ్రహ్మనాడి' ద్వారానే జీవుడు పరమాత్ముణ్ణి చేరుకో గలుగుతాడనే విషయాన్ని కొబ్బరికాయ తెలియజేస్తోంది.కొబ్బరికాయ ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంది.

మూత్ర సంబంధమైన వ్యాధులకు .పార్శ్వపు నొప్పులకు .

అతి సారానికి మంచి ఔషధంగా కొబ్బరినీరు పనిచేస్తుంది.ఆరోగ్యాన్ని .

ఆధ్యాత్మికపరమైన సందేశాన్ని ఇచ్చే కొబ్బరి మన ఆచారాల్లో ప్రధానమైన స్థానాన్ని సంపాదించింది.

డైరెక్టర్ అనుదీప్ కెవి చెప్పిన కథను వెంకటేష్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?