న్యాయవాదుల హత్యపై కేసీఆర్ మౌనం దేనికి సంకేతం?
TeluguStop.com
మంథనిలో జరిగిన న్యాయవాదుల హత్య ఎంత సంచలనం సృష్టించిందో మనం చూసాం.నడి రోడ్డు మీద ఏమాత్రం భయం లేకుండా ఫ్యాక్షన్ తరహాలో చంపడం అనే సంస్కృతి తెలంగాణలో లేదు.
అయితే ఇందులో ఓ టీఆర్ఎస్ ముఖ్య నేత హస్తముందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి తరహా ఘటన ఒకటి జరిగినప్పుడు కేసీఆర్ ఈ ఘటనపై ఎలాంటి కామెంట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇప్పటికే అధికార పక్షంపై మాటల తూటాలు పేలుస్తున్న ప్రతిపక్షాలకు ఇది మరొక ఆయుధంగా దొరికిందనే చెప్పవచ్చు.
ప్రజల్లో మెల్ల మెల్లగా టీఆర్ఎస్ పై వ్యతిరేకత వస్తున్న సందర్భంలో పార్టీని ముందుండి నడిపించడంలో కేసీఆర్, కేటీఆర్ విఫలమవుతున్నారని సగటు ప్రజలు అభిప్రాయపడే అవకాశం ఉంది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఖండించి ఉంటే ప్రజలకు మంచి సంకేతం వెళ్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే అయోధ్య రామాలయ నిర్మాణ నిధి సేకరణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో మనం చూశాం.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో టీఆర్ఎస్కు చిక్కులు తప్పకపోవచ్చు.భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.
వైరల్: కోడిని వెంటాడిన మొసళ్లు.. ఎవరు గెలిచారంటే?