ఆర్య తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సుకుమార్ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడుగా గుర్తింపు పొందిన సుకుమార్( Sukumar ) చేసిన ప్రతి సినిమా నుంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాలో తనను తాను మరోసారి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే సుకుమార్ అల్లుఅర్జున్( Alluarjun ) డైరెక్షన్ లో ఆర్య అనే సినిమా వచ్చింది.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా తనను తాను పరిచయం చేసుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన జగడం అనే సినిమా చేశాడు.ఈ సినిమా ప్లాప్ అయింది అయినప్పటికి ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
"""/" /
అయితే సుకుమార్ ఆర్య సినిమా తర్వాత నుంచి ఒకసారి కూడా మళ్ళీ దిల్ రాజు బ్యానర్ ( Dil Raju Banner ) లో సినిమా చేయలేదు దానికి కారణం ఏంటి అంటే నిజానికి జగడం సినిమా దిల్ రాజు బ్యానర్ లో చేయాల్సింది.
కానీ దిల్ రాజు ఆ ప్రాజెక్టు కి ఒకే చెప్పలేదు.దాంతో ఇదే సినిమాను వేరే వాళ్ళతో చేసి సక్సెస్ కొడుతున్నానని బయటికి వచ్చి వేరే బ్యానర్ లో ఆ సినిమాను చేసి ఫెయిల్యూర్ అందుకున్నాడు.
ఇక ఆ తర్వాత నుంచి దిల్ రాజుకి తనకి మధ్య పెద్దగా సత్సంబంధాలు లేనట్టుగా తెలుస్తుంది.
అందువల్లే వీళ్ళిద్దరి కాంబోలో మరో సినిమా అయితే రావడం లేదు. """/" /
ఇక మొత్తానికైతే తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజుతో సుకుమార్ సినిమా చేయకపోవడం చాలా దురదృష్టకరం అంటూ సుకుమార్ అభిమానులు, దిల్ రాజు అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి అయితే దిల్ రాజు సుకుమార్ కాంబోలో ఫ్యూచర్లో ఏదైనా సినిమా వస్తుందేమో చూడాలి.
హీరో అజిత్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ తో మరో సినిమా చేస్తున్నాడా..?