దేవర మీద రాజమౌళి స్పందించకపోవడానికి కారణం ఏంటి..?

ఈనెల 27వ తేదీన ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా( Devara ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.

ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీయార్ యాక్టింగ్ బాగుందని చెప్తున్నారు.తప్ప సినిమా మాత్రం అల్టిమేట్ గా ఉందని ఎవరు చెప్పడం లేదు.

బహుశా అందువల్లే ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందని సినీ పెద్దలు సైతం ఒక అంచనాకి వచ్చారు.

"""/" / ఇక మొత్తానికైతే ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుందనే విషయంలోనే సినిమా మేకర్స్ ఆలోచిస్తున్నారు.

మరి మొత్తానికైతే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటి వరకైతే ఈ సినిమా కలెక్షన్స్ చాలా స్టెబిల్ గా ముందుకు సాగుతున్నాయి.

రోజుకు 100 కోట్ల చొప్పున ఈ సినిమా మూడు రోజులలో 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

నిజానికైతే ఈ సినిమాలో ఎన్టీఆర్( Jr Ntr ) పోషించిన రెండు పాత్రలు అద్భుతంగా ఉన్నాయి.

అందువల్లే ఆయన ఒంటిచేత్తో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

"""/" / ఇక కొరటాల శివ పెద్దగా మ్యాజిక్ చేయనప్పటికీ ఎన్టీఆర్ ఒక్కడే తన భుజల మీద ముందుకు తీసుకెళ్ళి ఈ సినిమాను యావరేజ్ గా నిలిపాడు అంటూ మరికొంతమంది కామెంట్లు అయితే చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఈ సినిమాని తన ఫ్యామిలీతో కలిసి చూశాడు.

అయినప్పటికీ ఆయన ఈ సినిమా మీద ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు.కారణం ఏదైనా కూడా జక్కన్న ఈ సినిమా మీద స్పందించకపోవడం ఎన్టీయార్ అభిమానులను తీవ్రమైన కలవరానికి గురి చేస్తుంది.

వీడియో: డబ్బాలో తల ఇరుక్కుని హిమాలయన్ ఎలుగుబంటి విలవిల.. రక్షించిన ఇండియన్ ఆర్మీ..