దేవర సినిమా తో 1000 కోట్లు పక్క అంటున్న ఎన్టీయార్…అంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం ఏంటంటే..?

జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న 'దేవర' సినిమా( Devara ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

ఈ సంవత్సరం ఫస్ట్ ఆఫ్ లో ప్రభాస్ ఒక్కడే కల్కి సినిమాతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు.

ఇక సెకండాఫ్ లో కూడా పెద్దగా సినిమాలు ఏమీ రావడం లేదు.ఇక వచ్చే సినిమాల్లో దేవర సినిమా ఒకటే ప్రస్తుతం భారీ అంచనాలతో రాబోతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / అయితే డిసెంబర్ 6వ తేదీన 'పుష్ప 2( Pushpa 2 )' సినిమా రిలీజ్ చేస్తాం అంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ అది సాధ్యం అయ్యే విధంగా కనిపించడం లేదు.

దానివల్లే ఇప్పుడున్న సిచువేషన్ లో ఈ ఇయర్ సెకండ్ ఆఫ్ లో దేవర సినిమా మాత్రం కచ్చితంగా వస్తుంది.

ఇక ఈ సినిమా మీదనే ప్రేక్షకులు కూడా మంచి అంచనాలైతే పెట్టుకున్నారు.మరి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే ఎన్టీఆర్ పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్నవాడవుతాడు.

ఇక ఈ సినిమా కోసం దాదాపు 350 నుంచి 400 కోట్ల వరకు బడ్జెట్ ను పెడుతున్నారట.

"""/" / ఇక ఈ సినిమా దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందంటూ సినిమా మేకర్స్ అయితే మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు.

అయితే ఈ సినిమా ఔట్ పుట్ కూడా చాలా బాగా వచ్చిందట.అందుకే వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ఎన్టీఆర్ అంతటి మ్యాజిక్ ను చేసి 1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఈ సినిమాతో కనక 1000 కోట్లు వచ్చినట్టైతే ఎన్టీఆర్ పాన్ ఇండియాలో టాప్ హీరో రేంజ్ కి వెళ్ళిపోతాడు.

ఇక దాంతో పాటుగా ఆయన చేస్తున్న వార్ 2 ( War 2 )సినిమా మీద కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది.

కృష్ణుడి పూజలో కొణిదెల క్లీంకార.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇదే!