నాగార్జున చేసిన ఆ హిట్ సినిమాను వదిలేసి ప్లాప్ సినిమా చేయడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna )లాంటి హీరో మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఎందుకంటే ఆయన ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడిగా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు.

దాదాపు 70 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్నా కూడా నాగార్జున ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండ వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

"""/" / ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలతో పోటీ పడి మరి వరుస సినిమాలు చేస్తూ తనని తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక నాగార్జున కొడుకుల అయిన నాగచైతన్య, అఖిల్( Naga Chaitanya, Akhil ) లకి పోటీని ఇస్తూ ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ హీరోగా కూడా మంచి గుర్తింపు పొందుతున్నాడు.

ఇక ఇప్పుడు నాగ చైతన్య, అఖిల్ లాంటి స్టార్ హీరోలకి సవాళ్లను విసురుతూ తన ఏజ్ తో సంబంధం లేకుండా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన 100 వ సినిమాను చేసే దిశ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన 'అల్లరి ప్రియుడు' సినిమాను( Allari Priyudu ) మొదట నాగార్జునను హీరోగా పెట్టి చేయాలని అనుకున్నారు.

"""/" / కానీ నాగార్జున అప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల ఈ సినిమా చేయలేకపోయాడు.

అయితే రాఘవేంద్ర రావు ఈ సినిమా కోసం కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలని ఆలోచించి యాంగ్రీ యంగ్ మాన్ గా గుర్తింపు పొందిన రాజశేఖర్ ని ఈ సినిమాలో హీరోగా తీసుకొని సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.

ఇక కొదండ రామిరెడ్డి రదర్శకత్వంలో రాముడోచ్చాడు అనే సినిమా చేస్తూ బిజీగా ఉండడం వల్లే రాఘవేంద్రరావు సినిమాని రిజెక్ట్ చేశాడు.

అయితే రాముడోచ్చాడు సినిమా( Ramudochadu Movie ) అంత పెద్దగా సక్సెస్ సాధించలేదు.

ఇక దాన్ని వదిలేసి అల్లరి ప్రియుడు సినిమా కనక చేసినట్లయితే మంచి సక్సెస్ దక్కేది అని చాలా మంది తెలియజేస్తున్నారు.

జలుబు, దగ్గు, కఫంతో బాగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే వాటికి ఇలా చెక్ పెట్టండి!